ఆ కలెక్టర్ ది ఆత్మహత్యే!

Wednesday, May 20th, 2015, 02:21:51 PM IST


కర్ణాటకలో అత్యంత అనుమానాస్పదంగా మరణించిన వాణిజ్య పన్నుల శాఖ ఐఏఎస్ అధికారి డీకే రవిది ఆత్మహత్యేనని సీబీఐ తేల్చి చెప్పింది. ఇక రవికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా నష్టం రావడం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. అలాగే చిక్ బళ్లాపూర్ ప్రాంతంలో 50ఎకరాలు కొనుగోలు చేసేందుకు రవి డబ్బులు కూడబెట్టారని, అందులో తీవ్రంగా నష్టం రావడం వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందులో ఎటువంటి కుట్ర, కుంభకోణం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. ఇక రవి చిట్ట చివరిగా పనిచేసిన వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు ఫైళ్ల నుండి సేకరించిన సమాచారం ప్రకారం సీబీఐ ఈ నివేదికను వెలువరించింది.