దాచేపల్లి కీచకుడి ఆత్మహత్య!

Friday, May 4th, 2018, 02:25:00 PM IST

ప్రస్తుత మనిషి ఆలోచనలు క్రూరమృగం కన్నా దారుణంగా తయారయ్యాయి అనడానికి మరొక నిలువెత్తు నిదర్శనం, గత రెండు రోజులు క్రితం గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై ఒక వృద్ధుడు అత్యాచారం చేయడం. కాగా ఈ దుర్ఘటన తర్వాత బాలిక తరపు బంధువులు ఆ ఊరి హైవే పై తీవ్ర ఆందోళన చేప్పట్టిన సంగతి తెలిసందే .అయితే ఆ తరువాత స్థానిక ఎస్ఐ అక్కడికి చేరుకొని నిందితున్ని పట్టుకుని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వగా వారు దీక్ష విరమించారు. కాగా నిన్న గ్రామంలోని వారందరు స్వచ్చంధంగా బంద్ పాటించారు.

ఈ ఉదంతం తాలూకు నిరసనలు మరింత తీవ్రతరం కావడంతో స్థానిక ఎమ్యెల్యే, ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగి నిందితుడు సుబ్బయ్య కోసం పోలీస్ అధికారుల సహాయంతో ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో తీవ్రంగా గాలింపు చెర్యలు చేపట్టారు. కాగా సుబ్బయ్య తన బంధువులకు ఫోన్ చేసి, తాను తప్పు చేసానని, దానివల్ల తన కొడుకు నిందలపాలు అవుతున్నాడని , తనకి బ్రతకాలని లేదని, చచ్చిపోతున్నానని ఫోనెచేసి చెప్పాడని తెలుస్తోంది. అనంతరం తిరిగి సుబ్బయ్య ఫోన్ కు కాల్ చేస్తే స్విచ్ఆఫ్ అని వస్తోంది అని అతని బంధువులు అంటున్నారు.

కాగా నేడు గురజాల అమరలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఒక వృద్ధుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు అతడు సుబ్బయ్య అని ప్రజలకు, మీడియా వారికీ నిర్ధారించారు. అత్యాచారానికి గురికాబడ్డ బాలికకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని, బాలికను అన్నివిధాలా ఆదుకుంటామని, జరిగిన దుర్ఘటనపై తమదే బాధ్యత అని హోమ్ మంత్రి చినరాజప్ప అన్నారు……