బాధితులకు సినిపరిశ్రమ అండగా ఉంటుంది : దాసరి

Sunday, November 30th, 2014, 10:30:24 AM IST


తుఫాను బాదితులను ఆదుకోవడానికి తెలుగు సిని పరిశ్రమ ముందుకు వచ్చినందుకు దర్శకరత్న దాసరి నారాయణ రావు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో సభావించిన హుధూద్ తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం ఏర్పాటు చేసిన మేముసైతం కార్యక్రమంలో దాసరి నారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో విపత్తులు సంభవించినప్పుడు తెలుగు సినిపరిశ్రమ స్పందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెన, రాయలసీమ కరువు కాలంలో తెలుగు సినిపరిశ్రమ విరాళాలు సేకరించిందని ఆయన తెలిపారు. ఇప్పుడు హుధూద్ బాధితులను ఆదుకోవడం కోసం మేమున్నామని… మేముసైతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని… దీనిద్వారా సేకరించిన మొత్తాన్ని సిఎం సహాయ నిధికి పంపుతామని దాసరి తెలిపారు.