చక్రితో సినిమాలు చేయాలనుకున్నా: దాసరి

Monday, December 15th, 2014, 03:14:30 PM IST


ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి భౌతిక కాయానికి దర్శక రత్న దాసరి నారాయణ రావు నివాళులు అర్పించారు. చక్రి హఠాత్ మరణం పట్ల ఆయన తన ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు. చక్రి సంగీతం అంటే తనకు ఇష్టమని చెప్పారు. చక్రితో భవిష్యత్ లో సినిమాలు చేద్దామని అనుకున్నట్టు దాసరి ఈ సందర్భంగా తెలిపారు.

ఈ రోజు ఉదయం చక్రి గుండెపోటుతో హఠాత్ గా మరణించిన విషయం తెలిసిందే. కాగ, ఆయన బౌతిక కాయాన్ని ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ చాంబర్ కు తరలించారు. సినిరాజకీయ ప్రముకులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన బాచి చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటివరకు దాదాపుగా 50 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.