ఇద్దరు స్త్రీల పెళ్ళికి అడ్డొచ్చిన తల్లి హత్యకు గురైంది…అసలేం జరిగింది..?

Monday, March 12th, 2018, 04:23:37 PM IST

మనం ఎప్పుడైనా తల్లిదండ్రులను చంపిన కొడుకులను చూశాం ! కానీ ఇక్కడ కొంచం కొత్త కోణంలో మరో దారుణం జరిగింది. ఓ కూతురు తన తల్లిని దారుణంగా చంపింది. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన 18 ఏళ్ల బాలిక.. ఓ మహిళా టీచర్‌తో చనువుగా ఉంటుంది. ఆ టీచర్‌తోనే సహజీవనం చేస్తుంది. ఇద్దరు బయటకు వెళ్లి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు ఖండించారు. పద్ధతి మార్చుకోవాలని బాలికను హెచ్చరించారు. ప్రకృతి విరుద్దమైన పనులు చేయద్దన్నారు. తమ సంబంధానికి తల్లిదండ్రులు అడ్డు వస్తున్నారనే ఆగ్రహంతో, బాలిక తన అమ్మను అంతమొందించాలని కుట్ర చేసింది.

మార్చి 9న తన 35 ఏళ్ల తల్లిని కర్రలు, రాడ్లతో చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన తల్లి.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. బాలిక చేసిన దాడిపై తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక, మహిళా టీచర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే ఈ మహిళా టీచర్ తన భర్తతో కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే గత మూడు నెలల నుంచి బాలిక, మహిళా టీచర్ దగ్గరయ్యారు. జన్యువుల లోపమో లేక ఇంకేమైనా రోగమో కానీ బాలికా, టీచర్ల తప్పుడు సంబందానికి ఒక నిండు జీవితం అర్థాంతరంగానే ఆగిపోయింది.