నేటిఏపి సర్వే : బీజేపికి నెటిజన్ల మద్దతు

Friday, February 6th, 2015, 01:11:18 AM IST


ఫిబ్రవరి 7న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా, నేటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు తన శక్తి వంచనలేకుండా ప్రచారాన్ని నిర్వహించాయి. కొన్ని సంస్థలు ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే దానిపై ముందస్తు సర్వేలు నిర్వహించాయి. కొన్ని బీజేపికి అవకాశం ఉన్నది అంటే.. మరికొన్ని ఆప్ పార్టీకి అవకాశం ఉన్నదని తెలియజేశాయి. అభివృద్ధి నినాదంతో బీజేపి ప్రచారం నిర్వహించగా, గతంలో చేసిన తప్పును మరలా చేయబోమని, అధికారంలోకి వస్తే అవినీతిపై యుద్ధం చేస్తామని, ఇక ఢిల్లీలో 24గంటలపాటు విధ్యుత్ అందజేస్తామని ఆప్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఆప్ మరియు బీజేపిలపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ…ప్రధాని మోడీవి మాటలే కాని చేతలు మాత్రం శూన్యం అని, తాము అధికారంలో వస్తే.. పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ హామీలిస్తూ ప్రచారం చేసింది.

ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనే విషయంపై నెటిజన్ల అభిప్రాయం తెలుసుకునేందుకు సర్వేను నిర్వహించింది. బీజేపికే అవకాశం ఉన్నది అంటూ 56.94% మంది అభిప్రాయపడగా, 38.29% మంది ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది 3.97% మంది అభిప్రాయపడగా, కేవలం 0.79% మంది మాత్రమే కాంగ్రెస్ కు ఓటు వేశారు. దీనిని బట్టి చూసుకుంటే..ఢిల్లీలో గెలిచే అవకాశాలు బీజేపికి ఉన్నట్టు తెలుస్తున్నది.

అన్ని పార్టీల సభలకు ప్రజలు భారీగానే తరలి వచ్చారు. ర్యాలీలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకుల భవిష్యత్తును నిర్ణయించే ఓటు ఎవరికీ వేస్తారో చూడాలి మరి.

పోల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి