ఫలితాలపై ఉత్కంఠ..!

Tuesday, February 10th, 2015, 08:13:13 AM IST


ఢిల్లీ ఎన్నికల లెక్కింపు ప్రారంభం అయింది. అయితే, ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధిస్తుందని చెప్పుకుంటూ వస్తున్నాయి. కాని, బీజేపి మాత్రం తమ గెలుపు తద్యం అని, ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాట్ పోల్స్ ఏమిటో చూడాలని బీజేపి నాయకులు అంటున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటు ఆప్ వైపు మళ్లిందని తెలుస్తున్నది. ఇదే జరిగితే ఆప్ గెలుపు ఖాయం. లేదు, ప్రజలు అభివృద్ధి కోరుకుంటూ, స్థిరమైన పాలన అందించాలని భావిస్తే మాత్రం బీజేపి గెలుపు ఖాయం. ఏమి జరుగుతుందో.. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారో ఈ మధ్యాహ్నం ఒంటిగంట వరకు తేలిపోతుంది. అయితే, ఏ పార్టీ గెలిచినా అది ఆ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం మాత్రం తక్కువే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక, గతంలో అధికారం చేజిక్కించుకొని.. 49రోజులకే రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్ గతంలో చేసిన తప్పును మరలా చేయబోమంటూ ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పడంతో… అక్కడి ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ పై సానుభూతి చూపించినట్టు కూడా తెలుస్తున్నది. బీజేపి ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కిరణ్ బేడిని ప్రకటించడంతో బీజేపి చేసిన తప్పు అని కొందరు భావిస్తున్నారు. బీజేపి ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కిరణ్ బేడిని కాకుండా హర్షవర్ధన్ ను కనుక ప్రకటించిఉన్నట్టైతే విజయావకాశాలు బీజేపి మెండుగా ఉండేవని విశ్లేషకులు అంటున్నారు. మరి ఏ పార్టీ గెలుస్తుందో తెలియాలంటే మాత్రం మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.