కాళిమాత శపిస్తుంది అనగానే హత్య చేశారు!

Tuesday, May 29th, 2018, 04:46:40 PM IST

ప్రస్తుత రోజుల్లో మనిషి ఆలోచన ఎంత క్రూరంగా మారుతోంది అంటే.. ఎదుటి మనిషి ఎంత ఏడిస్తే ఎంత సంతోషం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. మరికొందరు నరకయాతన చూపించి మరి చంపడం సంచలనంగా మారుతోంది. ఇటీవల ఓ వ్యక్తి హత్య ఢిల్లీలో అందరిని భయానికి గురి చేసింది. కాళీ మాత వేషధారణతో వెళ్లిన వ్యక్తి శవమై కనిపించాడు. అసలు వివరాల్లోకి వెళితే రీసెంట్ గా ఎన్‌ఎస్‌ఐసీ అటవీ ప్రాంతంలో శవం కనిపించిందని పోలీసులు కు సమాచారం అందింది.

చనిపోయిన వ్యక్తి కాళికా మాతా వేషధారణలో ఉన్నట్లు తెలిసింది. అసలు అతను ఎందుకు అలా ఉన్నాడు. వంటి మీద భయంకరమైన గాయాలు కనిపిస్తున్నాయి. కత్తి పోట్లు కూడా ఉన్నాయి. అంత కసిగా చంపాల్సిన అవసరం ఏం వచ్చిందని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి పేరు కలూ అని పోలీసులు తెలుసుకున్నారు. అయితే అతనికి ఎవరు లేరు. అనాధగా కల్కజీ మందిర్‌ సమీపంలోని ధర్మశాలలో పెరిగాడు. హిజ్రాల తో కలిసి కాళి మాతను పూజించేవాడు. కలూ తానే దేవతను అని చెప్పుకునే వాడు. అయితే హత్య చేయబడిన ముందు అతను కాళి మాత వేషధారణతో కనిపించినట్లు కొంత మంది ఆశ్రమం పిల్లలు పోలీసులకు తెలిపారు.

పూజ అయిపోగానే బయటకు వెళ్లిన అతనీతో ఒక వ్యక్తి గొడవపడినట్లు పోలీసులు తెలుసుకొని సిసి కెమెరాల ద్వారా ఓ వ్యక్తిని పట్టుకొని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఆ రోజు తాగి ఉన్న నలుగురు యువకులను కలూ ని అడ్డగించారు. అతని చున్నీ పట్టుకొని లాగి అసభ్యంగా ప్రవర్తించారు. తాను కాళీ మాతను అనవసరంగా ఆగ్రహం తెప్పించకండని శపిస్తుందని కలూ చెప్పడంతో తాగిన మైకంలో యువకులు అతన్ని పొదల్లోకి తీసుకెళ్లి కత్తులతో రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ తరువాత నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకి తరలించారు.