‘రివ్యూ రాజా’ తీన్‌మార్ : ధర్మయోగి – పాలిటిక్స్ ఎక్కువైనా బాగుంది..!

Saturday, October 29th, 2016, 04:27:04 PM IST

తెరపై కనిపించిన వారు : ధనుష, త్రిష, అనుపమ పరమేశ్వరన్
కెప్టెన్ ఆఫ్ ‘ధర్మ యోగి’ : దురై సెంథిల్ కుమార్

మూలకథ :

కవల పిల్లలైన ధర్మ (ధనుష్), యోగి (ధనుష్)లలో యోగికి చిన్నప్పట్నుంచే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక అలవాటైపోతుంది. పెద్దయ్యాక తమ ప్రాంతానికి యోగి ఒక మంచి రాజకీయనాయకుడు అవుతాడు. ఒకసారి ఎన్నికల్లో యోగి అతడి ప్రియురాలు రుద్ర (త్రిష)పై పోటీ పడాల్సి వస్తుంది. ఆ ఎన్నికల సమయంలోనే యోగి హత్య కాబడతాడు. యోగిని ఎవరు హత్య చేశారూ? ధర్మ దాన్ని ఎలా చేధించాడూ? అన్నదే సినిమా.

విజిల్ పోడు :

1. స్టోరీలైన్‌కి విజిల్స్ వేస్తూనే ఉండొచ్చు. కవల పిల్లల మధ్యన ఒక కథ మొదలుపెట్టి, రాజకీయ కోణంలో నడిచే దానికి ఈ పాత్రలను కలపడం అదిరింది. ఆ స్టోరీలైన్‌కి ఏ మాత్రం తగ్గకుండా ట్విస్ట్‌లతో నడిచే స్క్రీన్‌ప్లే విజిల్స్ వేయిస్తుంది.

2. త్రిష రోల్ సినిమాకే హైలైట్. ఎన్నో సినిమాల్లో సరదా పాత్రలు చేసిన ఆమె, ఈ సినిమాలో ఓ ఇంటెన్స్ రోల్‌లో కట్టిపడేసింది. ముఖ్యంగా సెకండాఫ్ త్రిష రోల్ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్ అయితే మామూలుగా లేదు.

3. ధనుష్ అంటే స్టైల్‌కి స్టైల్, యాక్టింగ్‌కి యాక్టింగ్. ఈ సినిమాలోనూ అతడు తనదైన టైమింగ్ ఉన్న యాక్టింగ్‌తో అలవోకగా నటించేశాడు. అతడి డ్యూయల్ రోల్‌కి విజిల్స్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. కాస్త డీటైలింగ్ ఎక్కువైపోవడం ఢమ్మాల్‌గా చెప్పాలి. దీనివల్లే అక్కడక్కడా సినిమా చాలా నెమ్మదిగా నడిచినట్లు అనిపించింది.

2. తెలుగు వర్షన్‌కు సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. డైలాగ్స్ అటుంచితే, పాటలైతే తెలుగుకొచ్చేసరికి ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు.

3. అనుపమ పరమేశ్వరన్, శరణ్య లాంటి యాక్టర్స్ ఉన్నా వాళ్ళ పాత్రలను మామూలుగా ఉంచడం ఢమ్మాలే!

దావుడా – ఈ సిత్రాలు చూశారూ ..!!

–> ఇలాంటి ఆసక్తికరమైన పొలిటికల్ థ్రిల్లర్‌లో మొదట్లో ఒక సోషల్ ఎలిమెంట్‌ను బాగానే మొదలుపెట్టి తర్వాత దాన్ని మర్చిపోవడం కాస్త చిత్రంగానే కనిపించింది.

–> మొదట్నుంచీ భయపడుతూ ఉండే హీరో, అన్నయ్య చనిపోయిన తర్వాత పూర్తిగా ఆయనలాగే మారిపోవడం, ఫైట్స్ చేయడం కమర్షియల్ యాంగిల్‌లో ఓకే అనుకున్నా అదీ కాస్త సిత్రంగానే తోచింది.

–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : త్రిష రోల్ ఇలా ఉంటదని నేనైతే ఊహించలేదురా.. అదిరిపోయింది.
మిస్టర్ బీ : కానీ మొత్తం రాజకీయం గోలనే అయిపోయిందిరా.. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ లేదు.
మిస్టర్ ఏ : (సైలెంట్)