థోనీ పగ తీర్చుకున్నాడా..?

Monday, March 7th, 2016, 04:49:14 PM IST


నిన్న భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆసియా కప్ టీ – 20 ఫైనల్స్ లో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ థోనీ ఆడిన తీరు చూస్తే ఏదో పగ తీర్చుకున్నట్లు అనిపించింది. మ్యాచ్ ఆఖరి దశకు చేరుకుంది, అప్పటికే కోహ్లి, శిఖర్ థావన్ మ్యాచ్ ను దాదాపు ముగించేశారు. థోనీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అసలు థోనీ బ్యాటింగుకు రావాల్సిన పనిలేదు. యువ క్రికెటర్లు రైనా, పాండే, జడేజా చాలామందున్నారు.

కానీ థోనీనే దిగాడు. 6 బంతుల్లో 20 పరుగులు చేసి 333 . 3 స్ట్రైక్ రేట్ తో వీరవిహారం చేశాడు. దొరికిన బంతిని దొరికినట్టు వాయించేశాడు. దీనికి కారణం అంతకు ముందు బంగ్లా అభిమానులు బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ చేతిలో థోనీ తల ఉన్నట్లు పోస్టర్ చేసి పొగరును ప్రదర్శించడమే అని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమై ఉండొచ్చు కూడా. ఏదేమైనా నిన్న థోనీ ఆడిన తీరు ప్రతిఒక్క అభిమానినీ పులకింపజేసిందనే చెప్పాలి.