రివ్యూ ‘రాజా’ పాంచ్ పటాకా : డిక్టేటర్ – సంక్రాంతిని శాశించలేకపోయాడు.

Thursday, January 14th, 2016, 10:45:38 PM IST


తెరపై కనిపించిన వారు : బాలకృష్ణ, అంజలి, సోనాల్ చోహాన్ మొదలైనవారు…
కెప్టెన్ ఆఫ్ ‘డిక్టేటర్’ : శ్రీవాస్

మూల కథ :

ఢిల్లీ బేస్ పారిశ్రామిక వేత్త, ధర్మ గ్రూప్ అఫ్ కంపెనీస్ చైర్మెన్ అయిన చంద్ర శేఖర్ ధర్మ అలియాస్ డిక్టేటర్ (బాలకృష్ణ) తన కంపెనీని, అన్నయ్య సుమన్ ని ఢిల్లీని వదిలేసి హైదరబాద్ కి వచ్చి అక్కడ ఓ సూపర్ మార్కెట్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఎలాంటి గొడవలకి వెళ్ళకుండా, సైలంట్ గా తన పని తానూ చేసుకుపోయే ధర్మకి ఇందు(సోనాల్ చౌహాన్) పరిచయం అవుతుంది. తదన పరిచయం ద్వారా ధర్మ లైఫ్ లోకి మళ్ళీ విలన్స్ వస్తారు. అలా వచ్చిన విలన్స్ ని ఎలా ఎదుర్కున్నాడు? వారి నుంచి ఇందును ఎలా సేవ చేసాడు? దాని తర్వాత మళ్ళీ డిక్టేటర్ గా మారాడు? లేదా? అసలు డిక్టేటర్ అతనా కంపెనీని, ఢిల్లీని వదిలి ఎందుకు హైదరాబాద్ కి వచ్చాడు అన్నదే మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిన కథ.

‘విజిల్ పోడు’ :

1. బాలకృష్ణ మాస్ హీరో.. అందుకే దర్శకులంతా ఆయన్ని మాస్ యాంగిల్ లో చూపడానికే ట్రై చేస్తారు. కానీ ఈ సినిమాలో శ్రీవాస్ మాత్రం బాలకృష్ణని చాలా స్టైలిష్ గా, యంగ్ గా చూపించాడు. ఈ లుక్ బాలయ్యకు అదుర్స్.

2. డిక్టేటర్ పాత్రలో బాలయ్య బాబు పెర్ఫార్మన్స్ మరియు చాలెంజింగ్ డైలాగ్స్ మాత్రం అల్లాడించాడు. ఆ డైలాగ్స్ కి బాలయ్య అభిమానుల అరుపులతో థియేటర్ హోరెత్తింది.

3. హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ని గ్లామరస్ అట్రాక్షన్ కోసం తీసుకున్నారు. అందాల ఆరబోత విషయంలో సోనాల్ చౌహాన్ ఉన్న 20 నిమిషాలు 100% న్యాయం చేసింది.

4. ప్రతి సినిమాకి ది బెస్ట్ అనుకునే కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అలా ఈ సినిమాలో ది బెస్ట్ అనిపించుకున్న ఎపిసోడ్స్.. బాగా బోరింగ్ గా సాగుతున్న ఫస్ట్ హాఫ్ లో కాస్త ఊపు తెచ్చే క్లబ్ ఫైట్ అండ్ ఇంటర్వల్ బ్లాక్. ఆ తర్వాత ఫలాష్ బ్యాక్ ఎపిసోడ్ కి డిక్టేటర్ ఇంట్రడక్షన్, హైవే ఫైట్ ఎపిసోడ్.

5. బాలయ్యని స్టైలిష్ గా చూపడంలో, విజువల్స్ ని కలఫుల్ గా చూపడంలో శ్యాం కె నాయుడు
సినిమాటోగ్రఫీ మస్త్ ఉంటే, డిక్టేటర్ పాత్రకి బ్యాక్ గ్రొఉంగ్ మ్యూజిక్ తో చిన్నా ఇచ్చిన ఎలివేషన్ సూపర్.

‘ఢమ్మాల్ – డుమ్మీల్’ :

1. ఇక ఈ తెలుగు సినిమాల కథలు మారావా అనేంతలా ఫ్రస్ట్రేట్ చేసే కథ.. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, భాషా, లెజెండ్ లాంటి సినిమాల కథలని మిక్స్ చేసి కోన వెంకట్ – గోపి మోహన్ లు ఈ కథని రెడీ చేసారు. బాలయ్య లాంటి స్టార్ హీరోకి ఒక స్టొరీ లైన్ లేకుండా, కేవలం ఒక పాత్రని పెట్టుకొని కథ రాసిన ఘనత ఈ ఇద్దరు రచయితలకే దక్కుతుంది.

2. కథ పొతే పోయింది స్క్రీన్ ప్లే అన్నా బాగుందా అంటే అదీ లేదు.. స్క్రీన్ ప్లే లో ఎక్కడా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే అంశం ఒక్కటి కూడా లేదు. ఆడియన్స్ ఊహించినదే జరుగుతుంది. ఇంతోటి స్క్రీన్ ప్లే ని ముగ్గురు రాసారు.

3. ఇక నేరేషన్ అన్నా స్పీడ్ గా ఉందా అంటే లేదు.. సినిమా మొదటి నుంచి నత్త నడకలా చాలా స్లోగా సాగుతుంది. అటు ట్విస్ట్ లు లేక, నేరేషన్ లో స్పీడు లేక ప్రేక్షకులకు పరమ బోరింగ్ గా అనిపిస్తుంది.

4. కోన వెంకట్ – గోపి మోహన్ అంటే కామెడీకి ప్రాధాన్యత ఉంటుంది. కామెడీ ఉండాలనే ఫస్ట్ హాఫ్ ని వారి సక్సెస్ ఫార్ములాని ఫస్ట్ హాఫ్ లో పెట్టారు. కానీ ఒక్కటంటే ఒక్క సీన్ లో కూడా నవ్వించలేకపోయారు.

5. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలానే హీరో ఉంటే విలన్ ఉండాలి.. ఆ ఇద్దరూ సమ ఉజ్జీలుగా ఉంటేనే సినిమా యమ రంజుగా ఉంటుంది. విలన్ పవర్ఫుల్ గా లేకుండా, హీరోకి గట్టి పోటీని ఇవ్వకపోతే హీరోని ఎంత ఎలివేట్ చేసి చూపించినా వర్కౌట్ అవ్వదు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. బాలయ్య లాస్ట్ మాస్ హీరోకి లేడీ విలన్ ని సెలక్ట్ చేసుకోవడమే తప్పు.. అదీ కాక ఆ పాత్రని పవర్ఫుల్ గా చూపలేకపోవడం మరో మైనస్.. ఓవరాల్ గా హీరో పాత్రలో పవర్ ఉంది ఆ పవర్ ని ఎలివేట్ చేయగలిగే విలనిజం లేక హీరోయిజం డ్రాప్ అయ్యింది.

దావుడా – ఈ సిత్రాలు చూసారా.!!

–> కోన వెంకట్ – గోపి మోహన్ సినిమాలో సెకండాఫ్ అంతా ఒక ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ కన్ఫ్యూజన్ కామెడీ చేస్తారు. కానీ ఇందులో సెకండాఫ్ పార్ట్ ని ఫస్ట్ హాఫ్ లోకి తీసుకొచ్చారు. ఒక ఇంట్లో జరిగే దాన్ని ఒక కాలనీకి షిఫ్ట్ చేసాడు. కానీ అందులో కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు.

–> బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమాలో ఒకే ఒక్క ట్విస్ట్ కూడా లేకుండా కథనం రాయడం ఈ సినిమాకే చెల్లిందేమో..

–> చందు పాత్రలో బాలయ్య చాలా సైలంట్ గా, గొడవలకి వెళ్ళకుండా ఉంటాడు. కానీ అతను అలా ఉండటానికి సరైన రీజన్ మాత్రం ఉండదు. అలా ఉండమని ఎవరూ తనకి చెప్పారు కూడా..

–> 2014 ఇంగ్లీష్ లో వచ్చిన ‘ది ఈక్వలైజర్’ అనే సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్ అండ్ సీన్స్ ని కలిపి సినిమా ఫస్ట్ హాఫ్ ని సిద్దం చేసారు. అందులో హీరో ఫ్లాష్ బ్యాక్ ని ప్రాపర్ గా చూపరు, కానీ ఇందులో డెవలప్ చేసి చూపించారు.

–> ఈ సినిమా చూసాక ఇద్దరు ఇలా అనుకుంటూ వస్తున్నారు..
మిస్టర్ ఎ – బాలయ్య బాబు అభిమానులకు మాత్రం సెకండాఫ్ మస్త్ అనిపిస్తది కదరా ..
మిస్టర్ బి – అవునురా.. కానీ నా సమస్య అది కాదు.. ఈ రైటర్స్ కోన వెంకట్ – గోపి మోహన్ లు మారరా.. హీరోలని మారుస్తారు కానీ కథని మార్చారా..
మిస్టర్ ఎ – అవును కదా.. ఒక స్టొరీ లైన్ లేదు, ఒక ట్విస్ట్ లేదు..
మిస్టర్ బి – ఏందోలే.. కథే సినిమా విజయానికి బలం అనే విషయాన్ని రచయితలే నమ్మకపోతే మిగతా వాళ్ళెందుకు నమ్ముతారు.