రివ్యూ రాజా తీన్‌మార్ : దువ్వాడ జగన్నాథం – అగ్రహారం వరకు బాగుంది

Friday, June 23rd, 2017, 03:04:36 PM IST


తెరపై కనిపించిన వారు: అల్లు అర్జున్, పూజ హెగ్డే

కెప్టెన్ ఆఫ్ ‘దువ్వాడ జగన్నాథం’ : హరీశ్ శంకర్

మూల కథ :

అగ్రహారంలో పుట్టిన బ్రాహ్మణ యువకుడే ‘దువ్వాడ జగన్నాథం’. చిన్నప్పటి నుండి సభ్య సమాజంలో జరిగే అన్యాయాలను చూసి తట్టుకోలేని జగన్నాథం వాటిని అణచడానికి ఏదో ఒకటి చెయ్యాలని తపనపడుతూ పెరిగి పెద్దై వంటవాడిగా కొనసాగుతుంటాడు. అలా తను క్యాటరింగ్ చేస్తున్న ఒక పెళ్ళిలో పూజ (పూజ హెగ్డే)ను చూసి ప్రేమిస్తాడు.

అదే సమయంలో హైదరాబాద్లో జరుగుతున్న అన్యాయాచేస్తున్న వారిని డీజే అనే ఒక వ్యక్తి ఎదిరిస్తూ వాటికి కారణమైన వాళ్ళను చంపేస్తూ ఒక పెద్ద స్కామ్ కు మూలమైన రొయ్యల నాయుడు (రావు రమేష్) ను అంతం చేయాలి అనుకుంటాడు. దాంతో రొయ్యల నాయుడు డీజేను చంపాలనే ప్రయత్నంలో జగన్నాథాన్ని చంపబోతాడు. అసలు రొయ్యల నాయుడు జగన్నాథాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు ? డీజే ఎవరు ? జగన్నాథం సంబంధం ఏంటి ? రొయ్యల నాయుడు ఎలా ఎలా అంతమయ్యాడు ? అనేదే ఈ సినిమా.

విజిల్ పోడు :

–> సినిమాలో మొదటి విజిల్ వేయాల్సింది అల్లు అర్జున్ చేసిన జగన్నాథం పాత్రకు. ఆ పాత్ర చేసిన హడావుడి, పంచిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. దీని వలను ఫస్టాఫ్ మొత్తం చాలా సరదాగా సాగింది. కాబట్టి ఆ పాత్రకు ఒక విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక జగన్నాథం పాత్రలో నటించిన అల్లు అర్జున్ నటనకు రెండవ విజిల్ వేయొచ్చు. అచ్చమైన బ్రాహ్మణ యువకుడిగా వేషధారణలోను, మాటల్లోనూ, బాడీ లాంగ్వేజ్ లోను బన్నీ చాలా బాగా నటించాడు .

–> ఇక దర్శకుడు హరీశ్ శంకర్ ఒక నార్మల్ కథకి ఫన్ నిండిన జగన్నాథం పాత్రను కలిపి ఫస్టాఫ్ రూపొందించిన తీరు, ఆ పాత్రకు రాసిన డైలాగులు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఆ అంతేగాక హీరో హీరోయినులు ఆయనిచ్చిన ఇంట్రో కూడా అదిరింది. కనుక ఆయనకు మూడో విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్ సెకండాఫ్. ఈ భాగాల్లో పెద్దగా ఫన్ గాని, కొత్తదనం గాని దొరకదు. అంతేకాక ఈ భాగంలో ముఖ్యమైన జగన్నాథం పాత్ర కూడా ఏపీద్డగా కనిపిచ్న్హకపోవడంతో ఫన్ లభించలేదు.

–> అలాగే కథ చాలా రొటీన్ గా ఉండటం వలన రెండవ అర్థ భాగంలో ఏం జరుగుతోంది అనేది సులభంగా ఊహించవచ్చు. కనుక సినిమా అంత ఎగ్జైటింగా సాగలేదు.

–> అలాగే బన్నీ ప్రతి సినిమాలో చేసినట్టు ఇందులో పెద్దగా డ్యాన్సులు చేయలేదు. దాంతో ఆయన అభిమానులకు నిరుత్సాహం తప్పదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> డీజే కొన్నేళ్ల నుండి సిటీలోని రౌడీలను, అక్రమార్కులను చంపుతున్నా సినిమా మొత్తంలో ఒక్కసారి కూడా పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రస్తావన రాకపోవడం విచిత్రం.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా ఊహించనంత లేదు
మిస్టర్ బి : కొత్త కథ అనేది లేదు కదా.. అలానే ఉంటుంది.
మిస్టర్ ఏ: కానీ జగన్నాథం క్యారెక్టర్ మాత్రం బాగుంది.
మిస్టర్ బి : అవును.. అతను లేకపోతే అసలు సినిమానే లేదు.