దిల్ షుక్ నగర్ జంట పేలుళ్ళలో డాక్టర్ హస్తం

Wednesday, February 18th, 2015, 12:46:54 PM IST


దిల్ షుక్ నగర్ లో 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో వరస పేలుళ్లు జరిగాయి. దిల్ షుక్ నగర్ లో జరిగిన ఈ పేలుళ్ళతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కాగా, ఈ పేలుళ్లకు సంబందించిన కేసును ప్రభుత్వం ఎన్ఐఏ కు అప్పగించిన విషయం తెలిసిందే.తాజగా, ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జంటపేలుళ్ళకు ఉపయోగించిన పేలుడు పదార్ధాన్ని ఉగ్రవాది హడ్డీ కి బెంగళూరులో ఎవరు అందించారు అన్న విషయంపై పోలీసులకు క్లూ దొరికింది. బెంగళూరు డాక్టర్ సాబ్ గా పేరుపొందిన హోమియోపతి డాక్టర్ అఫాఖినే హడ్డీకి పేలుడు పదార్ధాలు అందించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అఫాఖీ… పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ మోజాహిదీన్ మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. కాగ, గతనెల 8న బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అఫాఖీతో పాటు సద్దామ్ హుస్సేన్, అబ్దుల్ సుబూర్ లను అరెస్ట్ చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో పై విషయాలు తేటతెల్లం అయ్యాయి.