ఢిల్లీ ప్రజలు తెలివైన తీర్పు ఇస్తారా…!

Wednesday, January 14th, 2015, 03:17:07 AM IST


ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 7న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలలో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు (బీజేపి, ఏఏపీ, కాంగ్రెస్) సిద్దం అయ్యాయి. గతంలో చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఓట్లు వేయాలని ప్రజలను పార్టీలు అభ్యర్ధించనున్నాయి. అభివృద్ధి, స్థిరమైన, స్వచ్చమైన పాలన అందించే పార్టీలకు ఓట్లు వేయాలని ప్రజలను పార్టీలు కోరనున్నాయి. అయితే, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎవరిని ఢిల్లీ ముఖ్యమంత్రిని చేయనున్నారు. గతంలో చేసిన పొరపాట్లను ఈసారి చేయబోమని, ఈసారి తమను గెలిపిస్తే… గతంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఏఏపీ అందున్నది. ఇక బీజేపి కూడా, దాదాపు అదే విధమైన హామీలనే ఇస్తున్నది. తాము క్లీన్ కంట్రీని కోరుకుంటున్నామని, అవినీతికి పాల్పడే వారు ఎవరైనా ఓడిలేది లేదని చెప్తున్నది. అయితే, బీజేపి అనుసరిస్తున్న విధానాలు కొంత ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. భూసేకరణ అంశం తీసుకొచ్చిన ఆర్డినెన్స్… పెద్ద పెద్ద వ్యాపారసంస్థలకు ఉపయోగపడేవిధంగా ఉన్నదని కొన్ని పార్టీలు అంటున్నాయి. ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకొని, బీజేపిపై విమర్శలు గుప్పించేందుకు సిద్దమవుతున్నాయి.

ఇక ఎన్నికలకు ముందు… కొన్ని సంస్థలు సర్వేను నిర్వహించాయి. వీటి ప్రకారం బీజేపికి 35 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని, ఏఏపీ 25 నుంచి 31 సీట్లు, కాంగ్రెస్ 3 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. అయితే, అత్యధిక స్థానాలు బీజేపి గెలుచుకున్నా, ముఖ్యమంత్రిగా మాత్రం అరవింద్ కేజ్రీవాల్ నే ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఈ ఎన్నికలలో కూడా, కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని తెలుస్తున్నది.