కొండెక్కుతున్న డాలర్ ధర….త్వరలో రూ.70కి చేరిక!

Thursday, June 28th, 2018, 07:41:52 PM IST

డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రోజురోజుకి పడిపోతోంది. గడిచిన 19 నెలల కనిష్టానికి నేడు అది రూ. 68.61 వద్ద స్థిరపడింది. దీనికి ప్రధాన కారణం దేశీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడమే అని తెలుస్తోంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, వర్తక యుద్ధం ఆందోళనలు, డాలర్ ఇండెక్స్ లో బలం మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలలో బలహీనత వంటివి రూపాయి విలువ తరుగుదలకు ప్రధాన కారకాలు. దేశీయ స్థూల ఆర్థిక మౌలిక విధానాలు స్థిరంగా మారడంతోపాటు, కరెన్సీ పతనంకు ఇతర కీలక అంశాలు కూడా ఉన్నాయి.

భారతదేశం వాణిజ్య లోటు దేశంగా ఉండటం, బలహీనపరిచే రూపాయిని కలిగి ఉండటం సహజంగా, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు మూలధన ప్రవాహం వల్ల చమురు కూడా పెరుగుతుంది. గ్లోబల్ గా చూస్తే, యుఎస్ఏలో పెరుగుతున్నఎగుమతులకు డిమాండ్ ఉండడంతో ఈ మూడేళ్ళలో డాలర్ మరింత వృద్ధి చెందుతూ వస్తోంది. ఆసియ స్టాక్ మార్కెట్లు గడచిన 9 నెలల్లో క్షీణత చెందడం కూడా డాలర్ మారకం విలువని మరింత పెంచేస్తోంది. ఇకపోతే రానున్న కొద్దీ రోజుల్లోనే ఈ విలువ రూ.70కి చేరుతుండంలో ఏమాత్రం సందేహం అవసరం లేదని స్టాక్ రీసెర్చ్ అనలిస్ట్ రుషబ్ మరు అంటున్నారు……