అమెరికా వాసులు కానీ వారి పిల్లలకి ఇక్కడ పౌరసత్వం వర్తించదు..ట్రంప్ సంచలనం!

Wednesday, October 31st, 2018, 01:01:54 AM IST

సంచలన నిర్ణయాలకు మరో పేరు అయినటువంటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మళ్ళీ అమెరికా వాసులకు మరో బాంబు వేశారు.ట్రంప్ తాను ప్రెసిడెంట్ అయిన మొదటి నుంచి ప్రాంతీయ భావాన్ని ఎక్కువగా చూపిస్తూనే ఉన్నారు దానికి నిదర్శనంగా అతను అధ్యక్షునిగా ఎంపికైన మొదటి లోనే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వలసదారులపై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.ఇప్పుడు కూడా ట్రంప్ మళ్ళీ అలాంటి నిర్ణయాన్నే తీసుకోబోతున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అమెరికా లో ఉండేటువంటి స్థానికులకు పుట్టిన పిల్లలకు తప్ప వేరే దేశాల నుంచి వచ్చిన వారికి పుట్టిన పిల్లలకు ఇక్కడ పౌరసత్వం వర్తించకూడదు అన్నట్టుగా తాను నిర్ణయం తీసుకోబోతున్నాను అని ట్రంప్ తెలిపారు.

అయితే ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద అప్పుడే నిరసనలు మొదలయ్యాయి.అయితే ట్రంప్ మాత్రం యూ ఎస్ కాంగ్రెస్ ఎన్నికలకు ఒక్క వారం ముందే ఈ నిర్ణయాన్ని తెలపడం చర్చనీయాంశం అయ్యింది.ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అక్కడి 14వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఉందని అక్కడి ప్రతిపక్షాల వాదన.కానీ ట్రంప్ మాత్రం వాటిని మార్చగలిగే హక్కు అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి వారికి ఉంటుందని,నేను కూడా అది అమలు పరిచే పనిలోనే ఉన్నానని చెప్పేసారు.అయితే అక్కడ ప్రభుత్వం 1898 లోనే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ప్రతీ ఒక్కరికి మతాలు,ప్రాంతాలకు అతీతంగా అక్కడ పౌరసత్వం వర్తిస్తుందని చట్టంలో ప్రవేశపెట్టారు.కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని అక్కడి ట్రంప్ వ్యతిరేఖులు వాదిస్తున్నారు.