వలసదారుల గ్రీన్ కార్డ్ అప్లికేషన్లపై ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు!

Tuesday, October 30th, 2018, 07:49:37 PM IST

ప్రపంచంలోని అగ్ర రాజ్యం అమెరికా యొక్క అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.అమెరికా లోని ప్రభుత్వ సదుపాయాలను ఎవరైతే పొందుతున్నారో అలాంటి వారు అందరు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లు మీద వేటు వేస్తున్నట్టుగా ట్రంప్ నిర్ణయం తెలుసుకున్నట్టు తెలుస్తుంది.ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అక్కడ నివసిస్తున్నటువంటి వేలాది మంది భారతీయులకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.అంతే కాకుండా ట్రంప్ తీసుకున్నటువంటి ఈ కొత్త నిర్ణయంలో ఎవరైతే వారి దేశంలో ఉండి ప్రభుత్వ సదుపాయాలను పొందుతున్న వలసదారులు ఉన్నారో వారు పూర్తిగా వీసాని పొందాలి అంటే వారు అమెరికా లోని ఒక స్థిరమైన స్థానం ఉంటేనే కుదురుతుందని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది.

ట్రంప్ ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా వలసదారులు ఉంటారో వారినే టార్గెట్ చేసుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది.ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వలన ఒబామా అధ్యక్షుడుగా ఉన్నపుడు ఉన్నటువంటి అధిక భారతీయుల మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది అని,వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారని ఒక నివేదిక ద్వారా తెలుస్తుంది.డోనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ ఆకస్మిక నిర్ణయం వలన ఎప్పటి నుంచో ఐటీ సెక్టర్ లో ఉన్నటువంటి భారతీయుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని,అంతే కాకుండా ఈ ఏప్రిల్ నెల వరకు చూసుకున్నట్టయితే దాదాపు ఆరు లక్షల గ్రీన్ కార్డ్ అప్లికేషన్ లు ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.