కూతుర్ని ఎంకరేజ్ చేస్తున్న ట్రంప్ !

Wednesday, October 10th, 2018, 05:35:34 PM IST

ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు ప్రతినిధిగా వ్యవహరిస్తూ తన డైనమిక్ ఆపరేషన్స్ తో మంచి పేరు తెచ్చుకున్న నిక్కీ హేలీ అకస్మాత్తుగా ఆ పదవికి రాజీనామా చేశారు. ఇలా ఆమె ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో ట్రంప్ కు, ఆమెకు మధ్యన విభేదాలేమైనా తలెత్తాయి అని అనుకున్నారంతా. కానీ అలాంటిదేం ఎల్దాని తేలింది. అలాగే రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదివికి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతోనే హేలీ ప్రతినిధి పదవికి స్వస్తి చెప్పారని అనుకున్నారు. కానీ పోటీ చేయాలనే ఉద్దేశ్యం తనకు లేదని, వచ్ఛే ఎన్నికల్లో కూడ ట్రంప్ తరపున ప్రచారం చేస్తానని అందామె.

దీంతో ఆమె స్దానంలోకి ఎవరొస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా చూస్తుండగా ట్రంప్ తన కుమార్తె ఇవాంక ట్రంప్ పేరును ఆ పదవికి ప్రస్తావించడం విశేషం. నిక్కీ హేలీ తర్వాత ఆ పదవికి అంతటి సమర్థురాలు ఇవాంక అని నేను అనుకుంటున్నాను. కానీ కూతుర్ని ఎంపిక చేస్తే వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్నానని అంటారు అన్న డోనాల్డ్ ప్రతినిధిగా కూతుర్నే ఎంపిక చేస్తారా లేకపోతే వేరొకరిని ఎంచుకుంటారా అనేది ఇంకా స్పష్టం చేయలేదు.