మాటల్లో కాదు చేతల్లో చూపించారు

Thursday, December 4th, 2014, 08:46:33 PM IST


తమ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని… చెప్పిన వాటిని తూచా తప్పకుండ అమలు చేసే ప్రభుత్వం అని మరోసారి నిరూపణ చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణ మూర్తి అన్నారు. రాష్ట్రం పచ్చగా ఉండటం జగన్ కు ఇష్టం లేదని అందుకే… తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే… దానిని కూడా తప్పు పడుతున్నారని కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల గురించి చంద్రబాబు నాయుడు నిరంతరం ఆలోచించారు కాబట్టే రైతుల రుణమాఫీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించక పోయినప్పటికీ చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అయన తెలిపారు.