ఈడీ జప్తు చేసిన జగన్ ఆస్తుల విలువ 749 కోట్లు కావు 4500 కోట్లు?!

Sunday, July 17th, 2016, 09:55:56 AM IST


జగన్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలోని సరస్వతి పవర్‌ అండ్ ఇండస్ట్రీస్‌కు చెందిన 903 ఎకరాలు, హైదరాబాద్ లోని సాక్షి టీవీ చానెల్, పత్రిక భవంతులు, బెంగళూరులోని విలాసవంతమైన భవంతి.. ఇవన్నీ ఈడీ అటాచ్ మెంట్లో ఉన్నాయి. వీటన్నిటి విలువ 749 కోట్లు అని ఇప్పటికే ప్రచారమైంది. అయితే వాటివిలువ వాస్తవ మార్కెట్లో వేరేగా ఉంటుందని అంచనాలేస్తున్నారంతా. కేవలం ఆ 903 ఎకరాల భూమి విలువే 500 కోట్లు పైగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అదేగాక విల్లాలు, సాక్షి ఆస్తుల విలువ, హైదరాబాద్ పరిసరాల్లోని ఇతరత్రా ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని చెప్పుకుంటున్నారు.

ఇవన్నీ బహిరంగ మార్కెట్లో అత్యంత కాస్ట్ లీవే కావడం గమనార్హం. ఈడీ చెప్పిన విలువకు మించి దాదాపు ఐదారు రెట్టు అధికంగా జగన్ ఆస్తుల ధర పలుకుతుందని చెప్పుకుంటున్నారు.
దొడ్డిదారిన తన విదేశీ కంపెనీల్లో కి పెట్టుబడులు తరలించడం, భారతీ సిమెంట్స్ లోకి అక్రమ సొమ్ముల్ని పెట్టుబడులుగా తరలించడం, అవినీతి కాంట్రాక్టులు తదితర కారణాలతో ఎన్ ఫోర్స్మెంట్ దర్యాప్తు (ఈడీ) బృందం ఇలా ఆస్తున్ని అటాచ్ చేసింది. జగన్ నిర్వాకం నిరూపణ అయ్యే సన్నివేశం కనిపిస్తోంది కాబట్టి సాక్షిపై ఆధారపడి బతుకులు వెళ్లదీస్తున్న వారి భవితవ్యంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే రాజకీయ పద్మవ్యూహంలో అభిమన్యుడిలా కాకుండా, అర్జునుడిలా బైటపడే ఛాన్స్ జగన్ కి ఉందా? అన్న దానిపైనే అన్నీ ఆధారపడి ఉన్నాయి.