నీరవ్ మోదీ జాడ కోసం సింగపూర్‌ లో వేట!

Monday, July 16th, 2018, 07:57:34 PM IST

13 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పట్టుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆపరేషన్ పనులను ముమ్మరం చేస్తోంది. అతని జాడ గురించి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా అధికారులు చాలా స్పీడ్ గా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 192 దేశాలు నిరవ్ మోడీని పట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. భారత్ అభ్యర్ధన మేరకు ఇంటర్‌పోల్‌ రెడ్‌-కార్నర్‌ నోటీసులు కూడా జారీ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నీరవ్ మోడీ కుంభ కోణాన్నిక బయటపెట్టడంతో జనవరిలో నీరవ్ ఒక్కసారిగా మాయమయ్యాడు. అలాగే అతని సన్నిహితులు కూడా దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఈడీ అధికారులు సింగపూర్ వెళ్లారు. అక్కడ అతని జాడ కనిపెట్టే పనిలో ముగ్గురు అధికారులు బిజీగా ఉన్నారు. భారత్ లో నమోదైన కేసుల గురించి సింగపూర్ అధికారులకు వివరించనున్నట్లు ఈడి వర్గాలు వెల్లడించాయి.