‘రివ్యూ రాజా’ తీన్‌మార్ : ఎక్కడికి పోతావు చిన్నవాడా – నిఖిల్ మరో హిట్ కొట్టాడుగా !

Saturday, November 19th, 2016, 03:30:45 AM IST


తెరపై కనిపించిన వారు : నిహిల్, నందిత శ్వేత, హబ్బే పటేల్
కెప్టెన్ ఆఫ్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ : విఐ ఆనంద్

మూల కథ :

అర్జున్ (నిఖిల్) అనే కుర్రాడు తన ఫ్రెండ్ ట్రీట్మెంట్ కోసం కేరళ వెళతాడు. అక్కడే నిత్య (హెబ్బా పటేల్)ను ప్రేమిస్తాడు. తీరా చూస్తే తాను ప్రేమించింది నిత్యని కాదని అమల అనే ఆత్మనని తెలుసుకుని కంగు తింటాడు. అంతలోనే అమల ఆత్మా అర్జున్ ని వెతుక్కుంటూ వస్తుంది. ఆమె నుండి అతప్పించుకోవడానికి అర్జున చాలా ప్రయత్నాలే చేస్తాడు కానీ ఆ ఆటమాటాన్ని వదలదు. అసలింతకీ ఆ ఆమల ఎవరు ? ఆత్మగా ఎందుకు మారింది ? అర్జున్ నే ఎందుకు ప్రేమించింది ? చివరికి అర్జున్ పరిస్థితి ఏమైంది ? అనేదే కథ.

విజిల్ పోడు :

1. విఐ ఆనంద్ థ్రిల్లర్ సినిమాకి ఎంటటైన్మెంట్ ని జోడించి కథను చెప్పిన విధానం బాగుంది. సినిమానౌ ఓపెన్ చేసిన తీరు, ఇంటర్వెల్ థ్రిల్, సెకండాఫ్ కథనం బాగున్నాయి. సాధారణంగా చూస్తే కన్ఫ్యూజన్ అనిపించే కథను చాలా వరకూ క్లియర్ గానే చెప్పాడు దర్శకుడు. కాబట్టి అతనికి ఒక విజిల్ వెయ్యొచ్చు.

2. ఇక సినిమా మొత్తం మంచి టైమింగ్, పంచ్ లతో అద్భుతమైన కామెడీని పండించి ఆద్యంత ఎంటర్టైన్ చేసిన వెన్నెల కిశోర్, సత్యలకు రెండో విజిల్ వెయ్యొచ్చు.

3. ఇక చివరగా అమల అనే ఆత్మ పాత్రను పోషించిన నటి నందితా శ్వేత నటన అద్భుతంగా ఉంది. కీలకమైన సన్నివేశాల్లో ఆమె హావభావాలు బాగా ఆకట్టుకున్నాయి. ఆమెకు చివరి విజిల్ గట్టిగా వెయ్యొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. సినిమా ఓపెనింగ్, ఇంటర్వెల్, కొన్ని కామెడీ బిట్స్ మినహా ఫస్టాఫ్ చాలా వరకూ బోర్ కొట్టించింది. అక్కడ రన్ టైమ్ తగ్గిచి ఉంటే బాగుండేది.

2. ఇక సినిమా క్లైమాక్స్ విషయానికొస్తే సెకండాఫ్ కథనం చూస్తే క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అనిపిస్తుంది. కానీ అదెక్కడికీ వెళ్ళలేదు. అన్ని సినిమాల్లోలాగే రొటీన్ గా ఉంది.

3. కాస్త కన్ఫ్యూజన్ ఉన్న స్టోరీని క్లారిటీగా చెప్పినప్పటికీ కథనం ఇంకా బలంగా ఉండి ఉండే సినిమా సినిమా ఇంకా బాగా ఆకట్టుకునేది.

దావుడా సిత్రాలు చూశారా ..!!

–> సినిమా ఆరంభంలో, ఆఖరులో బాటిల్ పగిలి ఆత్మ బయటికొచ్చినట్టు చూపుతారు అంటే మళ్లీ కథ మొదటి కొచ్చింది అనుకోవాలో లేక ముగింపు అంతేనని అనుకోవాలో క్లారిటీ ఉండదు.

మిస్టర్ ఏ : అరె.. నిఖిల్ సూపర్ రా మళ్ళీ హిట్ కొట్టాడు.
మిస్టర్ బి : అవును నిజమే మంచి సినిమా ఇచ్చాడు మరోసారి.
మిస్టర్ ఏ : అతనిలాగే ప్రయోగాలు చేస్తూ మంచి మంచి సినిమాలివ్వాలి. ఏమంటావ్ ?
మిస్టర్ బి : ఏమంటాను.. నిఖిల్ సక్సెస్ ఫార్ములా పట్టాడంటాను.