ఇంగ్లాండ్ కు బోనస్ పాయింట్

Tuesday, January 20th, 2015, 05:40:25 PM IST


ఆస్ట్రేలియాలో జరుగుతున్నముక్కోణపు సీరిస్ లో రెండో వన్డేలోనూ భారత్ ఆట తీరు మారలేదు. మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై ఓటమి పాలయిన ఇండియా రెండో వన్డేలోనూ పెవలంగా ఆడి, చేజేతులారా ఓటమిపాలయింది రెండో వన్డేలో ఇంగ్లాండ్ ఫేస్ బౌలింగ్ ధాటికి ఇండియా కేవలం 153పరుగులకే కుప్పకూలింది. ఫిన్ నాలుగు వికెట్లు తీసుకోగా, అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అయితే, మొదటి వన్డేలో రాణించిన రోహిత్ కు ఈ వన్డేలో విశ్రాంతిని ఇచ్చారు. అయితే, మొదటి వన్డేలో అర్ధసెంచరీ సాధించిన రైనా, రెండో వన్డేలో విఫలం అయ్యారు. బిన్నీ ఒక్కడే నలబై మార్కును దాటాడు. ధోని చేస్తున్న ప్రయోగాలూ విఫలం అవుతున్నాయి.

ఇక 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి, లక్ష్యాన్ని చేదించింది. ముప్పై ఓవర్లలో లక్ష్యాన్ని చేదించడంతో… ఇంగ్లాండ్ కు బోనస్ పాయింట్ కూడా లభించింది. రెండో వన్డేలో ఓటమి పాలవ్వడంతో… భారత్ ఫైనల్ కు చేరే అవకాశాలు సన్నగిల్లాయి.