తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు 200కోట్లు!

Monday, June 1st, 2015, 04:30:01 PM IST


తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబిల్లి దయాకర్ రావు సోమవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ 5వ అభ్యర్ధిని కూడా గెలిపించుకునేందుకు తెరాస పార్టీ కుట్రలు చేసిందని, ఈ ఎన్నికల కోసం 200కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా తెరాస పార్టీ కొనుగోలు చేసిందని ఎర్రబిల్లి తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ తెలంగాణ ద్రోహులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్సీ సీట్లను ఇచ్చారని నిప్పులు చెరిగారు. అలాగే ఎంఐఎం కూడా తెలంగాణ ద్రోహుల పార్టీనే అని, టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏ తప్పు చెయ్యకున్నా తెరాస నేతలు ఇరికించారని ఎర్రబిల్లి మండిపడ్డారు. ఇక సెటిల్ మెంట్లు, డబ్బు, పదవుల కోసమే టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలో చేరారని, ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస పెట్టిన ఖర్చుపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎర్రబిల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.