షాకింగ్ : అగ్ర రాజ్య అధ్యక్షుడు సీనియర్ బుష్ కన్నుమూత..!

Saturday, December 1st, 2018, 01:50:11 PM IST

ప్రపంచ అగ్రదేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికా అనే అంటారు అందరూ అభివృద్ధిలో ఎంతో వేగంగా దూసుకుపోతూ అగ్ర రాజ్యంగా పేరొందిన అమెరికాని పాలించినటువంటి 41 వ అధ్యక్షుడు అయినటువంటి “జార్జ్ వాకర్ బుష్” నిన్న కన్ను మూసారు.1924 జూన్ 12న జన్మించినటువంటి బుష్ 1989 నుచి 1993 వరకు ఆయన అమెరికాకు అధ్యక్షునిగా భాద్యతలు వహించారు.ఆ మధ్యలో అక్కడి నిఘా సంస్థ అయినటువంటి సి ఐ ఏ(సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ) సంస్థకు కూడా బుష్ డైరెక్టర్ గా పని చేసారు.నిన్న భారత కాలమానం ప్రకారం ఆయన యొక్క స్వగృహంలోనే శుక్రవారం అర్ధ రాత్రి ఆయన తన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తుంది.