ఫేస్ బుక్ సంస్థ నన్ను బలి పశువును చేసింది

Wednesday, March 21st, 2018, 04:18:46 PM IST

క్యాంబ్రిడ్జ్ అనలిటికా చేసిన మోసం వాళ్ళ ఫేస్ బుక్ మోసపోయి తీవ్ర స్థాయిలో నష్టపోయిందని, వాట్సప్ కో ఫౌండర్ బ్రియాన్ ఆక్టిస్ ఫేస్ బుక్ ను డిలేట్ చేయండి అని పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే ఆ సంస్థ క్యాంబ్రిడ్జ్ అనలిటికా కోసం యాప్ తయారు చేసిన అకడమిక్ విద్యార్థి ఇప్పుడు ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. డేటా చోరీ వివాదంలో తనను అన్యాయంగా ఆ సంస్థ ఇరికిస్తున్నదని వాపోతున్నాడు. క్యాంబ్రిడ్జ్ అనలిటికా కోసం డాక్టర్ అలగ్జాండర్ కోగన్ ప్రత్యేకమైన యాప్‌ను తయారు చేశాడు. 2014లో ఆ యాప్ తయారైంది. కానీ క్యాంబ్రిడ్జ్ అనలిటికా ఆ యాప్‌ను ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం వాడింది. సుమారు 5 కోట్ల మంది యూజర్ల డేటాను ఆ సంస్థ అక్రమంగా వాడుకున్నది. సోషల్ మీడియా ద్వారా మనుషుల ప్రవర్తనను చిత్రించేందుకు యాప్‌ను తయారు చేసినట్లు ప్రొఫెసర్ కోగన్ చెప్పాడు. కానీ ఫేస్‌బుక్ ఆ యాప్‌ను ట్రంప్ ప్రచారం కోసం వాడుకుంటుందని ఊహించలేదన్నాడు. మరోవైపు ప్రొఫెసర్ కోగన్‌పై ఫేస్‌బుక్ సంస్థ సీరియస్ అయ్యింది. కోగన్ సైట్ విధానాలను ఉల్లంఘించాడని ఆరోపిస్తున్నది. పర్సనాల్టీ సర్వే కోసం క్యాంబ్రిడ్జ్ వర్సిటీ పరిశోధకుడు సుమారు 2 లక్షల 70 యూజర్ల డేటాను రహస్యంగా సేకరించాడు. ఆ యూజర్ల స్నేహితుల నుంచి మరింత డేటాను కలెక్ట్ చేశారు. బిహేవియర్ స్టడీ కోసం తీసుకున్న డేటాను ఫేస్‌బుక్, క్యాంబ్రిడ్జ్ అనలిటికాలు తప్పుగా వాడినట్లు ప్రొఫెసర్ చెబుతున్నాడు. కానీ ఫేస్‌బుక్, క్యాంబ్రిడ్జ్ అనలిటికలు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నాయి. వీటన్నింటి వల్ల డాక్టర్ అలగ్జాండర్ కోగన్ తాను బలిపశువునయ్యాను అని ఆవేదన వ్యక్తం చేసాడు.