ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : అంతరిక్షం 9000KMPH

Friday, December 21st, 2018, 08:10:05 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా,అదితిరావ్ హీరోయిన్ గా “ఘాజీ” చిత్రంతో అద్భుతాన్ని సృష్టించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “అంతరిక్షం 9000KMPH”.ఈ చిత్రం ఆరంభమే కాస్త ఆసక్తికరంగా స్పేస్ లోని సీన్లను చూపిస్తూ ఆసక్తికరంగానే సాగుతుంది.అయితే కథలోని పాత్రలకు సంబందించిన అంశాలను పరిచయం చెయ్యడానికే దర్శకుడు ఎక్కువ సమయం కేటాయించడంతో ఫస్టాపే కాస్త సాగదీతగా ఉన్న ఫీల్ ప్రేక్షకునికి కలుగుతుంది.సైంటిస్ట్ గా వరుణ్ వ్యోమగామిగా అదితిరావ్ వారి పాత్రల మేరకు మంచి నటనను కనబర్చారు.. మొత్తానికి అయితే ఫస్టాఫ్ మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోకపోవడం మంచిది.ఇంటర్వెల్ సన్నివేశం కూడా పర్వాలేదనిపించే స్థాయిలోనే డిజైన్ చేసారు..దీన్ని బట్టి సెకండాఫ్ లో అసలు కథలోకి సినిమా వెళ్లేందుకు అవకాశం ఉందని చెప్పొచ్చు.మరి సెకండాఫ్ లో కథను దర్శకుడు కాస్త ఆసక్తికరంగా తీసుకెళతారో లేదో వేచి చూద్దాం.