రైతుకార్పోరేషన్ కు 5వేల కోట్లు

Sunday, October 5th, 2014, 09:47:45 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతురుణ మాఫీ కోసం ఏర్పాటు చేసిన రైతుకార్పోరేషన్ కు ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తోలి విడతగా 5వేల కోట్లు కేటాయించినట్టు తెలుస్తున్నది. సాదికారక రైతుకార్పోరేషన్ ద్వారా రుణాలు సమకూర్చి.. రైతురుణమాఫీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, డ్వాక్రా, చేనేత రుణాలను కూడా ఈ కార్పోరేషన్ ద్వారా సమకూర్చిన మొత్తం ద్వారా మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.