రాకాసి తూఫాన్ భయంతో వణుకుతున్న అమెరికా!

Thursday, September 13th, 2018, 05:00:02 PM IST

ఎన్నో దేశాల బెదిరింపులకు అదరని,బెదరని అగ్ర రాజ్యం ఇప్పుడు వణికిపోతుంది. ప్రకృతి నుంచి పొంచి ఉన్న పెను ప్రమాదంతో బెంబేలెత్తిపోతుంది.ఫ్లోరెన్స్ “హారికేన్” తూఫాను అక్కడ పెను బీభత్సం సృష్టించడానికి వేగంగా దూసుకొస్తోంది. దీనితో భయాందోళనకు గురి అయ్యిన అమెరికా వాసులు ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని తల దాచుకోడానికి సురక్షిత స్థావరాలకు తరలిపోతున్నారు.

ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని అక్కడి పోలీసు సిబ్బంది సురక్షిత ప్రదేశానికి తరలించారు.అమెరికా లోని కాలిఫోర్నియా, కేరోలీనా మరియు వర్జీనియా ప్రాంతాలకు భారీ నష్టం తప్పదు అని అక్కడి వాతావరణ సిబ్బంది తెలియజేస్తున్నారు.ఇప్పటికే అక్కడి సముద్ర తీర ప్రాంతం తీవ్ర అల్లకల్లోలంగా ఉందని అలలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి అని తెలిపారు. వచ్చే శుక్రవారం నాటికి ఈ తూఫాను తీవ్రత పెను తూఫానుగా మారే అవకాశం ఉంది అని తెలుపుతున్నారు.