పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రియురాలు ఏమిచేసిందంటే?

Monday, April 16th, 2018, 10:26:11 PM IST

ప్రస్తుతం యువత మేధో శక్తీ ఎన్నో రేట్లు దూసుకుపోతోంది. ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలు, సరికొత్త విధానాలు రూపొందిస్తూ ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వారిలో కొందరు మాత్రం అనవసరంగా, లేనిపోని చిన్న చిన్న కారణాలతో తమ నిండు నూరేళ్ళ జీవితాన్ని కాళరాస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమ పట్ల యువతకు సరైన అవగాహనాలోపం వల్ల ఇలా చిన్న చిన్న అర్ధంలేని కారణాలకు నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారని మానసిక నిపుణులు అంటున్నారు. ఇటీవల ప్రియుడు పెళ్ళికి నిరాకరించడంతో ఓ యువతి మనస్తాపంతో పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన పిట్టలవానిపాలెం మండలంలో కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం, గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలోని రెడ్లపాలెంకు చెందిన విజయ కుమారి,

అదే గ్రామానికి చెందిన డేగల రామకృష్ణారెడ్డి పది ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మొన్న తనని పెళ్ళి చేసుకోవాలని అడగ్గా రామకృష్ణారెడ్డి నిరాక రించడంతో విజయకుమారి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను పొన్నూరులోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటల సమయంలో చనిపోయింది. మృతురాలి తండ్రి వీరరాజు ఫిర్యాదు మేరకు చందోలు పోలీసులు కేసు నమోదు చేసి, విజయకుమారి, రామకృష్ణ ల మధ్య ఏదైనా వివాదం జరిగిందేమో అనే కోణం లో విచారణ చేస్తున్నారు. విజయకుమారి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి…..