నిలబడి పాడలేదని గాయనిని ఏంచేశాడో తెలుసా?

Thursday, April 12th, 2018, 03:46:21 PM IST


పాటలు పడుతున్న ఒక గాయానిని అమానుషంగా ఒక వ్యక్తి కాల్చి చంపిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో కలకలం రేపుతోంది. విషయం లోకి వెళితే, ఈ దారుణ ఘటన పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్సు పరిధిలోని కంగా గ్రామంలో జరిగింది. పాకిస్థాన్ ప్రముఖ గాయని సమీనా సామూన్, ఒక నిండు గర్భిణి. గర్భంతో ఉన్నా సరే కంగా గ్రామంలో ఓ కార్యక్రమంలో పాటలు పాడేందుకు వచ్చింది. గర్భవతి అయిన గాయని సమీనా కూర్చొని పాటలు పాడుతుండగా తారిఖ్ అహ్మద్ జతోయ్ అనే వ్యక్తి ఆమెను నిలబడి పాడాలని కోరాడు. తన మాట వినలేదనే కోపంతో గాయని సమీనాను తారిఖ్ అహ్మద్ దారుణంగా కాల్చి చంపాడు.

ఆ బుల్లెట్ దెబ్బలకు ఒక్కసారిగా కుప్పకూలిన సమీనాను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ప్రకటించారు. తన భార్యతో పాటు ఆమె గర్భంలో ఉన్న శిశువును కూడా హతమార్చిన నిందితుడిపై జంట హత్యల కేసు నమోదు చేయాలని సమీనా భర్త డిమాండ్ చేస్తున్నారు. సమీనా హత్య వీడియో క్లిప్ ను మానవహక్కుల సంఘం ప్రతినిధి కపిల్ దేవ్ ట్విట్టర్‌లో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. అంతటి దారుణానికి ఒడికట్టిన తారీఖ్ అహ్మద్ ను కఠినంగా శిక్షించాలని పలువురు నెటిజన్లు తమ కామెంట్ల ద్వారా తెలియచేస్తున్నారు……