తన ఇల్లీగల్ అఫైర్ కు అడ్డొస్తున్నాడని కన్న కొడుకుని….?

Saturday, August 25th, 2018, 12:48:37 PM IST

ప్రస్తుత సమాజంలో మంచి మానవత్వం రోజురోజుకు దిగజారిపోతున్నాయి అని చెప్పడానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఘటనే పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తమ స్వలాభం కోసం తన, పర అనేవి కూడాచూడకుండా ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడుతున్నారు కొందరు నీచులు. తన ఇల్లీగల్ అఫైర్ కి అడ్డొస్తున్నాడని కడుపున పుట్టిన బిడ్డనే హతమార్చిందో మహిళ. ఇక విషయంలోకి వెళితే, విజయనగరం జిల్లా గాయత్రీ నగర్ కు చెందిన వెంకట పద్మావతి తన 17 ఏళ్ళ కుమారుడు హరిభగవంతో కలిసి కొన్నేళ్ల నుండి నివాసముంటోంది. ఆరేళ్ళ క్రితం తన భర్తను కోల్పోయిన పద్మావతి ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారి గోవింద్ అనే వ్యక్తితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది. ఆ విషయం కుమారుడు హరిభగవాన్ కి తెలియడంతో, అతడు పలుమార్లు ఆమెను నిలదీసి,

అటువంటివి వద్దని, ఇకపై హాయిగా జీవిద్దామని తల్లికి నచ్చచెప్పబోయాడు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో తల్లిని కాదని, తమ ఇంటి పై పోర్షన్ లో అద్దెకు ఉంటున్న అమ్మమ్మ వద్దకు వెళ్లి ఆమె వద్దనే ఉంటున్నాడు. అంతే కాదు కొన్నాళ్ల నుండి తాగుడుకు బానిస కూడా అయ్యాడు. అయితే తమ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న హరిభగవాన్ తో ఎప్పటికైనా ప్రమాదమే అని తలచిన గోవింద్, పద్మావతితో కలిసి ఆమెను ఒప్పించి హరిని హత్య చేయించాలని నిశ్చయించాడు. అయితే తమ ప్లాన్ లో భాగంగా నిన్న తన తల్లి వూరువెళ్ళడంతో పద్మావతి, హరిభగవాన్ ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. అయితే అందులో దాదాపు 30కిపైగా నిద్రమాత్రలు కలిపి పెట్టడంతో అది తిన్న హరిభగవాన్ వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. ఆ వెంటనే గోవింద్ కు ఫోన్ చేసిన పద్మావతి అనంతరం తమ ప్లాన్ ప్రకారం హరిని చున్నీతో ఉరివేసి చంపి,

దానిని ఆత్మహత్యగా చిత్రీకరించింది. మరుసటిరోజు తెల్లారి అందరూ వచ్చి చూసేసరికి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో, అనుమానం వచ్చిన కొందరు విషయాన్ని పోలీస్ లకు తెలిపారు. మెల్లగా కూపీ లాగిన పోలీసులు పద్మావతిని గట్టిగా నిలదీయగా, తానే హరిని హత్య చేసినట్లు జరిగిందంతా చెప్పుకొచ్చింది పద్మావతి. ఊరువెళ్లిన పద్మావతి తల్లి ఆ రోజు ఇంటికి తిరిగివచ్చి మనవడు మరణించాడని తెలియడంతో భోరున విలపిస్తోంది. వెంటనే హత్య నేరంపై పద్మావతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను కోర్ట్ కి తరలించారు. ఘటన తరువాత గోవింద్ పరారవడంతో అతడిని త్వరలోనే వారు అంటున్నారు. కాగా ఈ ఘటనతో విజయనగరం వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు…..