పైపు లైన్ ద్వారా గ్యాస్ వచ్చేస్తోంది….!

Monday, August 27th, 2018, 11:39:38 AM IST

ఇప్పటివరకు మన దేశంలో ఇంటిఅవసరాలకు గ్యాస్ వినియోగం ఇప్పటివరకు ఎల్పీజీ సిలండర్ల ద్వారానే అధికంగా జరుగుతోంది. మరీ ముఖ్యంగా గృహ అవసరాలు సప్ప్లై చేయబడే ఎల్పీజీ సిలిండర్లు కొందరికి సకాలంలో అంధక కొన్ని సమస్యలను ఎదుర్కొంతున్న ఘటనలు చాలా చోట్ల వినపడుతూనే వున్నాయి. అయితే ఇటువంటి వాటికీ ఇకపై చెల్లు చీటీ ఇస్తూ కొన్నాళ్ల క్రితం ప్రభుత్వం పైపు లైన్ ద్వారా గ్యాస్ (పిఎన్జీ) సరఫరా విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దేశంలోని కొన్ని నగరాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని, ప్రస్తుతం గ్రేట్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో అమలు చేస్తోంది ప్రభుత్వం. అయితే ఇక రానున్న రోజుల్లో దీనిని మరింతగా విస్తృతపరిచి ముందుకు తీసుకెళ్లి ప్రజల సమస్యలు తీర్చేలా యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై గ్యాస్ ప్రక్రియను విస్తరించడానికి పైపు లైన్లకు టెండర్లు కూడా రెండు నెలల నుండి మొదలెట్టారు.

ఈ కొత్త విధానం వల్ల గ్యాస్‌ సరఫరాలో ఆలస్యం, సిలిండర్ల నుంచి గ్యాస్‌ చోరీ, బ్లాక్‌లో అమ్ముకోవడం, నివాసా ప్రాంతాల్లో అక్రమ ఫిల్లింగ్‌ వంటివి తగ్గుతాయి. రెండు, మూడేళ్లలో పీఎన్‌జీ సరఫరా గ్రేటర్‌ పరిధిలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే కార్యక్రమం పూర్తవుతుందని అంటున్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగం పెరగడం, అలానే వినియోగ దారుల అవసరాలకు సరిపడా సిలిండర్లను సరఫరా చేయలేకపోవంతో ప్రభుత్వం వివిధ దేశాల్లో అమలవుతున్న ఈ విధానంపై మక్కువ చూపుతోంది. కాగా ఈ విధానం వల్ల అపార్టుమెంట్లు, గ్రూప్ హోసింగ్ లు మరియు గేటెడ్ కమ్యూనిటీలు మరింత వెసులుబాటుగా ఉంటుందని, ఒక్కొక్క అపర్మెంటుకు ఒక గ్యాస్ లైన్ కసెక్షన్ ఇవ్వడం ద్వారా అందులో అందరూ నిర్వాసితులకు గ్యాస్ సరఫరా సులువు అవుతుందని, అదీకాక ఎంతవరకు గ్యాస్ వినియోగం జరిగిందో, అంతవరకు మాత్రమే బిల్ రావడం జరుగుతుందని అధికారులు చెపుతున్నారు…