కోర్టు హాలులో దెయ్యం కలకలం!

Friday, February 20th, 2015, 11:24:14 AM IST


కర్ణాటకలోని మైసూరు కోర్టు హాలులో దెయ్యం తిరుగుతోందనే పుకార్లతో ఆ ప్రాంతం హోరెత్తిపోతోంది. దీనితో ఆ హాలును తొమ్మిది నెలలుగా మూసివేశారు. ఇక తొమ్మిది నెలలుగా మూతబడిన ఆ హాలును ఇకపై కూడా తెరవద్దంటూ కొందరు న్యాయమూర్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా మరికొందరు మాత్రం దెయ్యాలు సంచరించడం అనేది మూఢ నమ్మకమని హాలును తెరవాలని సూచిస్తున్నారు. దీనితో పరస్పర భిన్నాభిప్రాయాల నేపధ్యంగా న్యాయవాదులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు పాల్పడుతున్నారు.

ఇక వివరాలలోకి వెళితే గతంలో ఇదే కోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే అతడు దెయ్యమై అక్కడ తిగితున్నాడనే పుకార్లతో గత ఏడాది మే నెలలో ఆ కోర్టు హాలును మూసివేశారు. కాగా ప్రస్తుతం ఈ హాలులో విరిగిపోయిన బల్లలు, కుర్చీలు వంటి పాత వస్తువులు వేసి స్టోర్ రూంగా ఉపయోగిస్తున్నారు. ఇక మూఢనమ్మకాల కారణంగా ఎన్నో కేసుల విచారణలకు నెలవుగా నిలిచిన ఆ కోర్టు హాలును మూతపడేలా చెయ్యడం హర్షణీయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.