లవర్ ఎదుటే యువతి గ్యాంగ్ రేప్!

Sunday, May 27th, 2018, 10:46:26 AM IST

నేటి కాలపు మనిషి ఆలోచనలు మృగముకంటె దారుణమయ్యాయి. మరీ ముఖ్యంగా ఆడవారిపై రోజూ ఎక్కడోఅక్కడ అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. మానవుడు శాస్త్ర సాంకేతికపరంగా ఎంతో వేగంగా ముందుకు దూసుకుపోతున్నప్పటికీ, కొందరు ఆడవారిపట్ల ఏ మాత్రం జాలి, దయ లేకుండా మృగాళ్ల వలే ప్రవర్తిస్తూ నీచత్వానికి పాల్పడుహతున్న ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనుషుల ఆలోచన, జీవన విధానాలని, మనిషి ఆలోచనల్లో విప్లవాత్మక మార్పులు రావాలని, లేకపోతే ఈ పరిస్థితి మరింతగా రోజురోజుకూ దిగజారిపోతోంది అని మానసిక నిపుణులు చెపుతున్నారు. ఇటీవల ఒక ప్రేమజంట పై కొందరు యువకులు దడి చేసి యువతిపై అత్యాచారం జరిపిన ఘటన ఆ ప్రాంత వాసులను భయకంపితులను చేసింది. విషయంలోకి వెళితే, రాత్రి సమయంలో గోవా లోని కోల్వా బీచ్ అందాలను చూడాలనుకునే ఒక రోజు రాత్రి బీచ్ కు బయల్దేరింది ఒక యువ ప్రేమ జంట.

బీచ్ లో కలియదిరుగుతున్న ఆ జంటను చూసిన ఇండోర్ కు చెందిన ధనుంజయ్ పాల్, రామ్ సంతోష్, విశ్వాస్ మక్రానాలు వారిద్దరిని అడ్డుకుని కొట్టి బంధించారు. అంతటితో ఆగకుండా యువకుడిని కట్టేసి యువతిపై వైస్చాచికంగా సామూహిక అత్యాచారం జరిపారు. ఘటన తర్వాత ఇద్దరినీ నగ్నంగా నిలబెట్టి ఫోటోలు తీసి, జరిగిన విషయం ఎవరికైనా చెపితే వాటిని సోషల్ మీడియా లో పెడతామని బెదిరించారు. కాగా తెల్లవారిన ఆతర్వాత ఆ జంట జరిగిన ఘటనపై పోలీస్ లకు ఫిర్యాదుకే చేయగా, వారి ఫిర్యాదు స్వీకరించిన పోలీస్ లు ఆ ముగ్గురు యువకులను వెతికి పట్టుకుని అరెస్ట్ చేశారు. బీచ్ ల్లో రాత్రి వేళల్లో తిరగడం శ్రేయస్కరం కాదని, అందునా ఆడవారు ఇటువంటి ప్రాంతాల్లో మరింత జాగ్రత్త వహించాలని స్థానిక ఎస్ఐ చెపుతున్నారు……