గోదావరి తల్లికి పుష్కర శోభ!

Tuesday, July 14th, 2015, 08:37:23 AM IST


తెలుగు రాష్ట్రాలలో గోదావరి పుష్కరాలు నేటి ఉదయం నుండి ప్రారంభమయ్యాయి. కాగా పవిత్ర గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు అన్ని పుష్కర ఘాట్ లకు భారీగా తరలి వచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కరస్నానం ఆచరించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ జిల్లా ధర్మపురిలో తన అర్ధాంగితో కలిసి పుష్కర స్నానం చేశారు. కాగా పది నిమిషాల తేడాతో ఇద్దరు ముఖ్యమంత్రులు పుష్కర స్నానం ఆచరిస్తారని భావించినప్పటికీ సరిగ్గా 6.31 నిమిషాలకే ఇద్దరూ పవిత్ర పుష్కరిణిలో స్నానమాడారు. ఇక లాంచనంగా ప్రారంభమైన ఈ పుష్కరాలలో తొలిరోజు స్నాన మాచరించేందుకు లక్షల్లో భక్తులు పుష్కర ఘాట్ లకు చేరుకున్నారు. కాగా భక్తుల జనసందోహంతో, పుష్కర శోభతో గోదావరి తల్లి కళకళలాడుతోంది.