హిట్టా లేక ఫట్టా: గూఢచారి ఫైనల్ రిపోర్ట్!

Friday, August 3rd, 2018, 06:27:30 PM IST

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే అందరిలా కాకుండా కొంచెం డిఫెరెంట్ గా ట్రై చేస్తేనే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. గత కొంత కాలంగా అడివిశేష్ కూడా అదే తరహాలో వినూత్న కథలతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. క్షణం సినిమాతో గతంలో ఈ కుర్ర హీరో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా అదే టీమ్ తో కలిసి గూఢచారి అనే సినిమా చేశాడు. శశి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు విడుదలైంది.

స్పై థ్రిల్లర్ గా కొనసాగే ఈ కథలో మంచి ఎమోషన్ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే సినిమాకు హైలెట్ గా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ కూడా సినిమాకు మరో ప్రధాన బలం. హీరో అడివి శేష్ తో పాటు మిగతా నటీనటులు బాగానే నటించారు. కానీ కొన్ని పాత్రల మధ్యలో సన్నివేశాలపై ఇంకా శ్రద్ధ పెట్టాల్సిందే. అలాగే నిర్మాణ విలువలు బాగానే ఉన్నప్పటికీ కథ పరంగా ఇంకాస్త ఎక్కువ స్థాయిలో చుపించాల్సింది. రెగ్యులర్ కమర్షియల్ లాంటి సినిమాల కాకుండా కొత్తగా వచ్చిన గూఢచారిపై ఎలాంటి హోప్స్ పెట్టుకోకుండా ఉంటే సినిమా నచ్చుతుందనే టాక్ వస్తోంది.

గూఢచారి – సస్పెన్స్ వర్సెస్ ఎమోషన్

Reviewed By 123telugu.com |Rating :3.5/5

ఈ వీక్ లో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్

Reviewed By timesofindia.com |Rating :4/5

ప్యాక్స్ పంచ్

Reviewed By www.mirchi9.com |Rating : 3/5

స్పై గేమ్స్

Reviewed By www.greatandhra.com|Rating : 3/5

టాలీవుడ్ బాండ్ చిత్రం

Reviewed By telugu.filmibeat.com .com |Rating : 2/5