ప్రణాళిక సంఘానికి కాలం చెల్లిందా !

Sunday, December 7th, 2014, 09:48:50 AM IST


ఈ రోజు భారత ప్రధాని మోడీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యామంత్రుల సమావేశం జరగనున్నది. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పకుండా హాజరు కావాలని ప్రధాని కార్యాలయం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటివరకు ఉన్న ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త చట్టం రూపుదిద్దుకొబోతున్నది. దీనికి సంబంధించి అన్ని అంశాలను చర్చించేందుకు ప్రధాని ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.

ఈ కొత్త సంస్థ రూపులు, విధివిధానాలు… ఇతర కర్తవ్యాలు తదితర అంశాలను గురించి ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కోరనున్నారు. అని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నాకే… కొత్త సంస్థను రూపకల్పన చేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ సమావేశంలో ప్రణాళిక సంఘం కార్యదర్శిగా ఉన్న భల్లార్ కొత్త సంస్థ విధులు పరిదులపై రూపొందించిన నివేదికను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరిస్తారు. ఇక భల్లార్ రూపొందించిన నివేదికపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకుంటారు. కొత్తగా రుపుదిద్దుకోబోతున్న సంస్థలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు స్థానం కల్పించబోతున్నట్టు తెలుస్తున్నది. మొత్తం ఈ కొత్త సంస్థలో 8 నుంచి 10 సభ్యులు ఉంటారని…దీనికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా ఉంటారు. అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో విస్తృతసమావేశం జరిపిన అనంతరమే కొత్త సంస్థను రూపొందిస్తామని మోడీ తెలిపిన విషయం విదితమే.