మూవీ రివ్యూ : గూఢచారి – ఆకట్టుకునే స్పై థ్రిల్లర్!

Friday, August 3rd, 2018, 02:47:05 PM IST

క్షణం మూవీ తరువాత అడివి శేష్ నటించిన చిత్రం గూఢచారి. మొదట టీజర్ విడుదలయినప్పటినుండి మంచి హైప్ ను క్రియేట్ చేసిన ఈ చిత్రం, తరువాత విడుదలయిన ట్రైలర్ తో ఆ హైప్ ని మరింత పెంచిందని చెప్పుకోవాలి. కాగా నేడు ప్రేక్షకులముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందొ తెలుసుకుందాం….

కథ:

అర్జున్ (అడివి శేష్) తండ్రి నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ గా పనిచేస్తూ టెర్రరిస్టుల అటాక్ లో చనిపోతాడు. అయితే ఒక ప్రేరణగా తన తండ్రిని తీసుకొని అర్జున్ కూడా ఒక ఎన్ఎస్ఏ ఏజెంట్ కావాలని, దేశానికి సేవ చేయాలని కోరుకుంటాడు. అనేక ట్రయల్స్ తరువాత, అతను త్రినేత్ర అని పిలువబడే ఒక జాతీయ నేర సంస్థలో చేరతాడు.అయితే అందులో చేరిన తరువాత అర్జున్ తన తండ్రి గత చరిత్ర మరియు అతని అసలు ఐడెంటిటీ గురించి తెలుసుకుంటాడు. అర్జున్ అసలు ఐడెంటిటీ ఏమిటి? దానిని దాచడం వెనుక అసలు కథ ఏమిటి? అర్జున్ టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్ ను ఎలా పట్టుకుని రా అధికారుల ముందు తన సీనియారిటీ నిరూపించుకుంటాడు? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే, మీరు థియేటర్లలో సినిమాని చూడాలి…

విశ్లేషణ :

మొదటగా, ఈ విధమైన స్పై తరహా చిత్రాన్ని తెలుగులో తీయడానికి ప్రయత్నించిన అడివి శేష్ ని ప్రశంసింఛాలి. ఈ చిత్రం మొత్తం సెటప్ మరియు స్పాన్ ను బట్టి చూస్తే ఈ చిత్రం ఒక పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్ చూసిన ఎక్సపీరియన్సు ని ఆడియన్స్ కి ఇస్తుంది. మొదటి అర్ధభాగంలో ఆకట్టుకునే పేస్ తో సాగే స్క్రీన్ ప్లేని వ్రాయటంలో తొలి చిత్రం అయినప్పటికీ దర్శకుడు శశి కిరణ్ మరియు అతని రచయితల బృందం ఎంతో పక్కాగా ప్లాన్ చేసారని చెప్పుకోవాలి. ఇక మెయిన్ విలన్ ని పూర్తిగా ఊహించని విధంగా వెల్లడించే విరామం బ్లాక్, సినిమాకి ఒక ప్రధాన ఆకర్షణ. ఇక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే అడివి శేష్ రా ఏజెంట్ పాత్రలో బాగా నటించాడు. అతని మ్యానరిజమ్స్ మరియు స్క్రీన్ పై నటించిన విధానం ఈ స్క్రీన్ ప్లే ఆధారిత చిత్రానికి బాగా హెల్ప్ అయ్యాయి. అర్జున్ కి అంకుల్ గా నటించిన ప్రకాష్ రాజ్ తన పాత్ర యొక్క పరిధి మేరకు బాగా నటించారు. ఇక బాలీవుడ్ స్టార్లెట్ శోభిత దులిపాళ తన పాత్ర ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేసిందనే చెప్పుకోవాలి. ఇకపోతే మధుశాలిని మరియు వెన్నెల కిషోర్ మరియు ఇతర ఎన్ఎస్ఏ సభ్యులు తమకు ఇచ్చిన పాత్రలలో ఒదిగిపోయారు….

ప్లస్ పాయింట్స్ :

→ స్క్రీన్ ప్లే

→ ట్విస్టులు మరియు మలుపులు

→ ఇంటర్వెల్ బ్లాక్

మైనస్ పాయింట్స్ :

→ సెకండ్ హాఫ్ లో డ్రాగ్ అవడం

→ తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆకట్టుకునేలా చూపించకపోవడం

తీర్పు :

మొత్తంగా చూస్తే, ఈ గూఢచారి చిత్రం స్పై-థ్రిల్లర్ గా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక మొదటి అర్ధభాగం అంతా కూడా ఇంటరెస్టింగ్ గా సాగుతూ, ఇక ఇంటర్వెల్ వద్దకు వచ్చేసరికి రివీల్ అయ్యే ట్విస్ట్ లో వచ్చే ఊహించని మలుపు ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తుంది. అయితే రెండవ అర్ధ భాగంలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. మీరు ఈ చిన్న పాయింట్ ని కనుక పెద్దగా పట్టించుకోకుంటే టోటల్ గా ఈ గూఢచారి తప్పకుండ ఒక డిఫరెంట్ సినిమా ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ కి ఇస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు….

Netiap.com Rating : 3.25/5

Reviewed by Netiap Team