పరీక్షలో 200 కిలోల చిట్టీలతో షాక్ ఇచ్చారు..

Thursday, May 24th, 2018, 06:32:02 PM IST

పరీక్షలో ఎలాగైనా పాస్ అవ్వాలని కొంత మంది విద్యార్థులు చిట్టీలు కొట్టడం చూస్తూనే ఉంటాం. ఎవరో కొంత మంది మాత్రమే అలా చేస్తారని ఈ మధ్య కాలంలో కాపీ కొట్టే విద్యార్థులు తక్కువైనట్లు గతంలో కొంత మంది విద్యా శాఖ ప్రముఖులు తెలియజేశారు. కానీ గుజరాత్ లో బయటపడ్డ చిట్టీల గురించి తెలిస్తే మాత్రం ఎవ్వరైనా సరే నోటి మీద వేలేసుకోవాల్సిందే. అలాగే విద్యార్థుల్లో ఇంకా మార్పులు చాలానే రావాలని అనుకుంటారు. జునాగఢ్ జిల్లా వంథాలీలో రీసెంట్ గా 12వ తరగతి సైన్స్ పరీక్ష నిర్వహించారు. అధికారులు ఈ పరీక్ష కోసం ముందుగానే సిద్దమయ్యి వచ్చారు.

ఎందుకంటే మే 14న జరిగిన పదవతరగతి పరీక్ష జరిగినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోని రోడ్లపై అనేక చిట్టీలు కనిపించినట్లు డీఈవో బీఎస్ కెల్లా కి సమాచారం అందడంతో స్వామి నారాయణ్ గురుకుల్ పరీక్షా కేంద్రంపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇక ఇంటర్ పరీక్షకు వచ్చిన విద్యార్థులు కూడా చిట్టీలు తెచ్చారని వాటిని వెంటనే బయటపెట్టాలని చెప్పడంతో పరీక్షకు ముందుగానే విద్యార్థులు చిట్టిలన్నీ బయటకు తీయగా వారి బరువు అధికారులను షాక్ కి గురి చేసింది. కుప్పలు కుప్పలుగా పడిన చిట్టీల బరువు 200 కిలోలు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఆ ఘట్టం చుసిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చిట్టిలను బయటపెట్టాలని లేకుంటే వేటు పడుతుందని అధికారులు మూడు సార్లు చెప్పడంతో విద్యారులు భయంతో చిట్టిలను బయటపెట్టారట.