‘దుబాయ్ శీను’లో సీనే జరిగింది!

Friday, April 3rd, 2015, 12:39:24 PM IST

dhubai
ఉపాధి కోసం అరబ్ దేశాలకు వలస వెళ్ళే వారిపట్ల జరిగే మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇక అరబ్ దేశాలకు ఉద్యోగం కోసం వెళ్ళే వారు అనగానే ‘దుబాయ్ శీను’ చిత్రం ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది. ఇక అందులో హీరోతో పాటు మరికొందరు కుర్రాళ్ళను దుబాయ్ కి తీసుకెళతామని చెప్పి ముంబైలో వదిలివేసే సన్నివేశం గుర్తుంది కదా. సరిగ్గా అలాంటి సన్నివేశమే నిజజీవితంలో కూడా జరిగింది. వివరాలలోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన 45మంది యువకులను దుబాయ్ పంపిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గరా 1.5లక్షల రూపాయలను కొందరు ఏజెంట్లు వసూలు చేశారు.

అనంతరం వారిని ముంబై ఎయిర్ పోర్టులో వదిలేసి సదరు ఏజెంట్లు పత్తాలేకుండా పోయారు. ఇక ఏజెంట్ల కోసం రెండు రోజులు ముంబైలోనే ఎదురు చూసిన యువకులు ఏదోలాగ నరసాపురం చేరుకున్నారు. అనంతరం తమకు జరిగిన మోసంపై తగిన చర్యలు తీసుకుని, తాము కట్టిన డబ్బును ఇప్పించాల్సిందిగా కుర్రాళ్ళు అధికారులకు విజ్ఞ్యప్తి చేశారు.