తెలుగు ఎన్ఆర్ఐ దారుణ హత్య!

Wednesday, April 8th, 2015, 09:39:51 AM IST


అమెరికా షికాగోలో తెలుగు ఎన్ఆర్ఐ హత్యకు గురైనారు. కాగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన మాదల రాజేష్ బాబును కొందరు దుండగులు హతమార్చారు. ఇక భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10గంటలకు హత్య జరిగినట్లు తెలుస్తోంది. కాగా రాజేష్ అమెరికా షికాగోలోని ఒక కంపనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. అయితే నల్ల జాతీయులు డబ్బు కోసం డిమాండ్ చెయ్యగా ఇవ్వడానికి నిరాకరించినందుకు రాజేష్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఇక రాజేష్ బాబు దొండపాడు గ్రామంలో మాదల ఆనందరావు, వెంకాయమ్మ దంపతుల కుమారుడు. ప్రాధమిక విద్య వరకు అదే గ్రామంలో చదువుకున్న ఆయన పదేళ్ళు హైదరాబాద్ లో ఉన్నత చదువులను అభ్యసించారు. అనంతరం షికాగోలో ఉద్యోగం చేస్తూ గుంటూరు నరసారావు పేట సమీపంలో వడ్లమాని పాలేనికి చెందిన నాగమణిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉన్నట్లు సమాచారం.