హెచ్-4 వీసాదారులు ప్రస్తుతానికి సేఫెనట!

Tuesday, July 3rd, 2018, 04:57:31 PM IST

అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడిగా గద్దెనెక్కాక స్థానికతకు పెద్దపీట వేయడం కోసం ఇతర దేశస్థులను సాధ్యమైనంతవరకు అమెరికా వెళ్లే విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, అంతే కాక ఇక్కడ నివాసముంటున్న విదేశస్థులను కూడా ఇబ్బందిపెట్టేలా ఆయన వ్యవహారాలు సాగుతుండడంతో ఆయనపై పలువిమర్శలకు తావిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా హెచ్-1బి వీసాల పై అక్కడికి బ్రతుకుతెరువు నిమిత్తం వెళ్లి జీవిస్తున్న వారి జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగ కల్పన చేయాలనీ గత అధ్యక్షులు బరాక్ ఒబామా అప్పట్లో హెచ్-4 వీసాలను ప్రవేశపెట్టారు. అయితే అప్పటినుండి ఆ వీసాలపై వేలాదిమంది హెచ్-1బి విసదారుల జీవిత భాగస్వాములైన మహిళలు ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్నారు. కాగా గత కొద్దిరోజులుగా ట్రంప్ ప్రభుత్వం ఈ తరహా వీసాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు ట్రంప్ ప్రభత్వం ఒక సూచన ప్రాయ ప్రకటన వెలువరించింది. వాస్తవానికి ఒకవేళ ఈ వీసాలను రద్దు చేస్తే కొన్ని వేలమంది భారతీయ మహిళలు అక్కడ ఉపాధిని కోల్పోవలసి వస్తుంది. హెచ్-4 వీసాల రద్దుపై ఈ ఏడాది జూన్ లోగా నోటీసు ఆఫ్ ప్రపోజ్డ్ రూల్ మేకింగ్ ను జారీ చేసేయోచనలో ఉన్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి.

ఈ విషయమై డిపార్ట్మెంట్ అఫ్ హోమ్ ల్యాండ్ కూడా మార్చిలో కోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. అయితే జూన్ నెల ప్రస్తుతం గడిచిపోవడంతో, ఎన్ఆర్పిఎమ్వై ఇప్పటివరకు ఈ విషయమై ఎందుకు ఎటువంటి ఆదేశం ఇవ్వలేదో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వివరణ ఇవ్వలేదు. అయితే అధ్యక్షడులు ట్రంప్ నిర్ణయంలో మార్పు లేదని, ప్రస్తుతానికి మాత్రం ఈ అంశం విషయమై తమ దగ్గర స్పష్టమైన వివరాలు లేవని, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగాధిపతులు కొందరు చెపుతున్నారట. దీనితో ప్రస్తుతం ఈ హెచ్-4 వీసాల రద్దుపై కొంత ఊరట లభించింది. కాగా మొదటినుండి ఈ తరహా వీసాలను రద్దు చేయవద్దని అమెరికన్ ఐటి కంపెనీలు సైతం ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాయి. ఆలా రద్దు చేయడంవల్ల దాని ప్రభావం ఉద్యోగులు, మరియు బిజినెస్ ఆపరేషన్స్ పై పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ట్రంప్ రానున్న రోజుల్లో అయినా తన మనసు మార్చుకుని హెచ్-4 వీసదారుల అభ్యర్ధన మేరకు వాటిని రద్దుచేయవద్దని అక్కడి ఎన్నారైలు విన్నవిస్తున్నారు…..