షాకింగ్ న్యూస్ : కన్నకూతురిపై అత్యాచారం…..షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్ట్

Thursday, April 26th, 2018, 10:35:59 AM IST

ప్రస్తుతం సమాజంలో మనిషి ఆలోచన సరళిలో వచ్చిన మార్పులు, ఎన్నడూ ఊహించలేని నీచమైన పనులను చేయిస్తోంది. చెప్పడానికి కూడా సిగ్గుపడేవిధంగా ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక సంఘటన వింటే మనసు కలచివేయకమానదు. తమిళనాడు, తంజావూరు ప్రాంతానికి చెందిన సుబ్రమణి వృత్తి రీత్యా పెయింటర్. అతని భార్య దినసరి కూలి. వారికి ఒక 17 సంవత్సరాల దివ్యనగరాలయిన కుమార్తె వుంది.

నిత్యం పని నిమిత్తం తల్లి ఉదయాన్నే వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేది. అయితే సుబ్రమణి మాత్రం ఇంటివద్దనే ఉంటూ పెయింటింగ్ లు వేస్తుండేవాడు. ఒకానొక రోజు అతడు ఒకపైశాచిక ఆలోచన చేసాడు. దివ్యంగురాలయిన కన్నబిడ్డ అనికూడా చూడకుండా, కర్కశంగా ఆమెపై అత్యాచారం జరిగిపాడు. ఈ విషయం తన తల్లికి కానీ, ఇంకెవరికియైన చెపితే ఆమెను చంపేస్తా అంటూ బెదిరించాడు. అలా కొద్దిరోజులపాటు ఆమెపై తన కామ వాంఛ తీర్చుకున్నాడు. కాగా ఒకనాడు కుమార్తెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు.

అయితే పరీక్షల అనంతరం ఆమె గర్భవతి అని తేలడంతో నిర్ఘాంతపోయిన ఆ తల్లి అసలు విషయం అడగ్గా, కూతురు జరిగినది మొత్తం ఆమెకు చెప్పింది. ఈ విషయమై స్థానిక పోలీస్ లకు ఫిర్యాదు చేయగా, వారు సుబ్రమణిని అదుపులోకి తీసుకుని కోర్ట్ లో హాజరుపరిచారు. కాగా మొన్న మంగళవారం కోర్ట్ కూతురిపై ఇంత నీచానికి దిగజారి ప్రవర్తించినందుకు నాలుగు జీవిత ఖైదు శిక్షలు, అలానే ఆమెను బెదిరింపులకు గురి చేసినందుకు ఆరునెలల జైలు శిక్ష విధించింది. నాలుగు జీవిత ఖైదులు అనగా సుబ్రమణి మరణించే వరకు అతన్ని జైలులోనే ఖైదు చేసి ఉంచాలనేది కోర్ట్ తీర్పు సారాంశం…..