తనకు అవమానంగా ఉందని చంపేశాడు

Friday, June 29th, 2018, 01:42:10 AM IST

ఇటీవల మన దేశంలో హత్యలు, నేరాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ధనం మూలం ఇదం జగత్ అనే పదానికి నేటి మనిషి పూర్తిగా మద్దతు పలుకుతున్నాడు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అనే బేధాలు లేకుండా కొందరు ఆగ్రహావేశాలతో కన్ను మిన్నూ కనకుండా తమవారినే పొట్టనపెట్టుకుంటున్న ఉదంతాలు నేడు రోజు ఎక్కడో అక్కడ జరుగుతూనే వున్నాయి. ఇకపోతే నేడు రాజధాని నగరంలో ఒక యువకుడు, ఇంటికి వచ్చి డబ్బులు అడగడం తనకు అవమానమని భావించి తల్లిని చంపిన ఉదంతం ఆ ప్రాంతవాసుల్లో తీవ్ర కలకలం రేపింది. ఇక విషయంలోకి వెళితే, ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న ఒక కుటుంబంలో తల్లి కొన్నాళ్ల నుండి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ ఉంది.

అయితే కొద్దిరోజుల క్రితం అనుకోకుండా అందులో నష్టాలు రావడంతో, తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వమని పలువురు ఇంటికి వచ్చి తరచు అడుగుతూ ఉండడంతో, దానిని అవమానంగా భావించిన ఆమె కొడుకు, నిన్నటి రాత్రి ఆమెను అత్యంత పాశవికంగా తలబద్దలుకొట్టి ఆపై గొంతు నులిమి చంపేశాడు. ఘటనపై ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైన ఇంటి చుట్టుప్రక్కలివారు వెంటనే పోలీస్ లకు సమాచారమందించారు. హుటాహుటిన ఘటన స్థలినికి చేరుకుకున్న పోలీస్ లు యువకుడిని అదుపులోకి తీసుకుని అతని తల్లిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీస్ లు అసలు జరిగిన విషయం ఏమిటి అనే దానిపై ఆరా తీస్తున్నారు…..