అందరిముందు భార్యని తగలబెట్టాడు!

Thursday, May 3rd, 2018, 03:00:58 PM IST

కట్టుకున్న భర్తే ఆమెపాలిటి కాలయముడైన ఘటన కేరళ లోని త్రిసూర్ లో జరిగింది. విషయంలోకి వెళితే కొన్నాళ్ల క్రితం వివాహమాడిన జంట విరాజ్, జీతూలు ఇద్దరిమధ్య కొన్ని మనస్పర్థల కారణంగా జీతూ, విరాజ్ నుండి విడాకులు తీసుకునేందుకు కోర్ట్ ని ఆశ్రయించారు. అయితే వారి కేసు ప్రస్తుతం కోర్ట్ లో పెండింగ్ లో ఉంది. కాగా మొన్న సోమవారం ఒక లోన్ నిమిత్తం జీతూ ఆమె తండ్రితోకలిసి బెంగళూరు వెళ్లారు. వారిద్దరిని వెంబడించిన విరాజ్ అక్కడి అధికారులతో మాట్లాడుతున్న జీతుపై వున్నట్లుండి పెట్రోల్ తీసుకువచ్చి పోసాడు. అంతే ఆ ఘటనతో భయపడ్డ జీతూ, అక్కడినుండి పరుగు తీసింది.

చుట్టుప్రక్కలివారిని తన కూతురుని రక్షించమని ఎంత బ్రతిమిలాడినా ఎవరు కూడా విరాజ్ ని నిలువరించలేదు సరికదా కనీసం ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఉండిపోయారు. ఆమె వెంటపడ్డ విరాజ్ చివరకు ఆమె చీరకు నిప్పంటించాడు. ఒళ్ళు మొత్తం కాలిపోతుండడంతో జీతూ పెట్టిన హాహాకారాలు కనీసం ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో చివరికి ఒక ఆటో డ్రైవర్ సాయంతో జీతూ తండ్రి ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. రెండు రోజులనుండి నరకవేదన అనుభవించిన ఆమె నిన్న హాస్పిటల్ లో మరణించింది. ఈ ఘటనపై జీతూ తండ్రి మాట్లాడుతూ, ఉగ్రవాదులకు కూడా మన దేశం శిక్ష వేసినప్పటికీ మంచి ఆతిధ్యమిస్తుంది.

అటువంటిది తన కూతుర్ని అంత అమానుషంగా పెట్రోల్ పోస్ట్ నిప్పంటిస్తుతే ఆపడానికి ఒక్కరుకూడా ముందుకి రాకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేసాడు. కాగా జీతూ బంధువుల ఫిర్యాదు మేరకు విరాజ్ కోసం వేట ప్రారంభించిన పోలీస్ లు అతడిని నిన్న ముంబై లో అరెస్ట్ చేసినట్లు త్లెలుస్తోంది. కాగా తమ కూతురిని అంత దారుణంగా హతమార్చిన విరాజ్ కు కఠిన శిక్ష విధించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు…..