స్పీకర్ ని అయినా వైద్యుడినే!

Tuesday, December 9th, 2014, 08:38:31 PM IST


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఢిల్లీలో మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ పరిశుభ్రత, పారిశుధ్యంపై శ్రద్ధ వహిస్తూ సత్తెనపల్లి నియోజకవర్గంలో 22వేల మరుగుదొడ్లను నిర్మించామని తెలిపారు. అలాగే ‘స్వచ్చ్ భారత్’ ద్వారా దేశంలో ఉన్న సామాజిక రుగ్మతలు తొలగి పోతాయని కోడెల వివరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ తాను స్పీకర్ అయినప్పటికీ వృత్తి రీత్యా వైద్యుడు కావడం చేత సామాజిక బాధ్యతలను నెరవేరుస్తున్నానని తెలిపారు. అలాగే త్వరలో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని, దానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేస్తారని పేర్కొన్నారు. ఇక ఈ కాన్ఫెరెన్స్ లో అనేక అంశాలపై చర్చ జరుగుతుందని, న్యాయపరమైన అంశాలు కూడా చర్చకు వస్తాయని, చర్చల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వవచ్చునని కోడెల శివ ప్రసాద్ వివరించారు.