వివాహితపై కన్నేసిన కామాంధుడు……ట్విస్ట్ ఇచ్చిన ఆమె భర్త!

Monday, May 21st, 2018, 11:25:20 AM IST

ప్రస్తుత కాలంలో మహిళల పై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు మృగాళ్ల నీచ ప్రవర్తన వల్ల అమాయక మహిళలు బలి అవుతున్నారు. మరి కొందరైతే మహిళల పరిస్థితులను ఆసరాగా చేసుకుని వారి కామవాంఛను తీర్చుకోవాలని చూస్తున్నారు. ఒక మహిళ కుటుంబ పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఆ మహిళను తన వైపుకు తిప్పుకోవాలని, అందుకోసం ఏకంగా ఆ ఆ మహిళ భర్తనే చంపించాలని పథకం పన్నిన ఒక దుర్మార్గుడి ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే జూబిలీహిల్స్ అపోలో ఆసుపత్రిలో స్పెషల్ మెయింటెనెన్సు విభాగంలో పనిచేస్తున్న మాల్యాద్రికి పెళ్లి అయి ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఒకరోజు ఒక వివాహిత ఫోన్ చేసి తన భర్తకు మెట్లమీదనుండి పడి కాలు విరిగింది అంబులెన్సు పంపండి అని ఆసుపత్రికి కాల్ చేసింది.

ఆ కాల్ లిఫ్ట్ చేసిన మాల్యాద్రి సదరు ఆసుపత్రి సిబ్బందితో అంబులెన్సు తీసుకుని వారింటికి వెళ్ళాడు. అలా మెల్లగా ఆమె భర్తకు తరువాత ఫిజియోథెరపీ పేరుతో రోజు ఇంటికి వెళ్లడం, మహిళతో ఎక్కువసేపు మాట్లాడుతూ గడపడం మొదలెట్టిన అతడు, ఎలాగైనా ఆ మహిళను తన వశం చేసుకోవాలని పధకం వేసాడు. ఒకరోజు వివాహిత భర్తతో మీ భార్య పిజి, ఎమ్ ఎస్ సి చేసారు కాబట్టి మా ఆసుపత్రిలోనే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. వివరాల నమోదు పేరుతో వారి ఫోన్ తీసుకుని ఒక యాప్ క్రియేట్ చేసి వారి మాటలు కదలికలు ఎప్పటికప్పడు తెలుసుకోసాగాడు. అలానే ఆమె భర్త పేరుతో ఆసుపత్రికి కొన్ని లేఖలు కూడా రాసాడు. ఒకరోజు నా భార్య విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది అలానే మన వివాహేతర సంబంధం మీ భర్తకు తెలిసిపోయింది అంటూ చెప్పడంతో, భయపడిన వివాహిత తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

అదే సరైన సమయం అనుకుని ఆమె భర్త అడ్డు ఎలాగైనా తొలగించి తరువాత వివాహితను తనవైపు తిప్పుకోవాలనుకున్నాడు. అంతే బంజారాహిల్స్ నందినగర్ కు చెందిన రామారావు అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి వివాహిత భర్తను హతమార్చవలసిందిగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే విషయం మొత్తం గ్రహించిన వివాహిత భర్త బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాల్యాద్రి పై ఫిర్యాదు చేయడంతో రంగం లోకి దిగిన పోలీసులు మాల్యాద్రిని అరెస్ట్ చేసి విచారించగా, అతడు జరిగినది పోలీస్ లకు చెప్పాడు. అంతే కాదు ఒకవేళ ఆమె భర్త హత్య పథకం పారదేమో అనే అనుమానంతో కొద్దిరోజుల నుండి అతనికి స్లో పాయిజన్ కూడా ఇస్తున్నట్లు తెలిపాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీస్ లు అతనిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు…….