ఒబామా కోసం భారీ బధ్రత..!

Saturday, January 17th, 2015, 05:42:35 PM IST


ఒబామా.. అమెరికా అధ్యక్షుడు… రేపు మనదేశంలో జరిగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిధులుగా హాజరు కానున్నారు. అయితే, ఒబామా ఈ వేడుకలకు హాజరు అవుతుండటంతో… ఢిల్లీలో భారీ బద్రతను ఏర్పాటు చేశారు. నగరమంతటా దాదాపుగా 15వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కనివినీ ఎరగని రీతిలో బద్రతను ఏర్పాటు చేయడంతో ఇప్పుడు… ఇదే విషయంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో భారీ బధ్రతను ఏర్పాటు చేయడంతో ఢిల్లీ హైకోర్ట్ లో ప్రజావ్యాజ్యం నమోదయింది. దీనిని విచారించిన హైకోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒబామా పర్యటన సందర్భంగా భద్రతా పెంచిన అధికారులు, భారతీయుల విషయంలో ఇటువంటి భద్రత ప్రమాణాలు ఎందుకు పాటించట్లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నేళ్లు అయినా నగర ప్రజల కోసం సీసీ టీవీలు ఏర్పాటు చేయని అధికారులు, ఒబామా కోసం వారంలోపే అంత భద్రతను కల్పించారు అని ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్ తప్పుబట్టింది.

ఇక ఇంత భారీ స్థాయిలో బధ్రతను ఏర్పాటు చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తీవ్రవాదుల హెచ్చరికలతో ఢిల్లీ భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నది.