ఫాస్ట్ పై టి ప్రభుత్వానికి హైకోర్ట్ చురక

Monday, January 19th, 2015, 01:52:07 PM IST


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫాస్ట్ పధకంపై హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి చురకంటించింది. ఫాస్ట్ పధకంపై కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఫాస్ట్ పై మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక, 1956 ప్రాతిపదికను ఎలా సమర్ధించుకుంటారో తెలియజేయాలని హైకోర్ట్ ప్రభుత్వాన్ని కోరింది. ఆలస్యం చేయకుండా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్ టి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక, ఫాస్ట్ పై విచారణకు రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఈ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.

టి ప్రభుత్వం ఫాస్ట్ పధకాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విషయం తెలిసిందే. 1956 ప్రాతిపదికన ఈ ఫాస్ట్ పధకం రూపొందింది. తెలంగాణ విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం అందించే ఫలాలు అందాలనే ఉద్దేశ్యంతోనే ఈ పధకం రూపొందింది.